`గేమ్‌ ఛేంజర్‌` విషయంలో తప్పు నాదే.. దిల్‌ రాజు షాకింగ్‌ స్టేట్‌మెంట్‌, మిస్టేక్‌ జరుగుతున్నా ఏం చేయలేకపోయా

Published : Jun 25, 2025, 05:10 PM IST

స్టార్‌ ప్రొడ్యూసర్‌, ఎఫ్‌డీసీ ఛైర్మెన్‌ దిల్‌రాజు.. రామ్‌ చరణ్‌ `గేమ్‌ ఛేంజర్‌` ఫెయిల్యూర్‌పై ఓపెన్‌ అయ్యారు. ఈ మూవీ విషయంలో తప్పు తనదే అని వెల్లడించారు. 

PREV
15
`గేమ్‌ ఛేంజర్‌` ఫెయిల్యూర్‌పై దిల్‌ రాజు కామెంట్‌

స్టార్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజు ఈ ఏడాది సంక్రాంతికి `గేమ్‌ ఛేంజర్‌` మూవీని విడుదల చేశారు. రామ్‌ చరణ్‌ హీరోగా, శంకర్‌ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. 

దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందింది. చాలా గ్రాండియర్‌గా దీన్ని తెరకెక్కించారు. కానీ సంక్రాంతికి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఆడియెన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. నిర్మాత దిల్‌ రాజుకి భారీ నష్టాలను తెచ్చిపెట్టింది.

25
దిల్‌ రాజుకు భారీ నష్టాలు తెచ్చిన `గేమ్‌ ఛేంజర్‌`

`గేమ్‌ ఛేంజర్‌` సినిమా పరాజయంపై గతంలోనూ ఓ సారి స్పందించారు దిల్‌ రాజు. ఇన్నాళ్లు గతుకుల రోడ్లపై ప్రయాణం చేశామని తెలిపారు. అదే సంక్రాంతికి వెంకటేష్‌ హీరోగా వచ్చిన `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాని విడుదల చేశారు. 

ఇది ఏకంగా రూ.350కోట్లు వసూలు చేసింది. `గేమ్‌ ఛేంజర్‌` వల్ల వచ్చిన నష్టాలను కొంత వరకు ఈ మూవీ భర్తీ చేసింది. దీంతో దిల్‌ రాజు కొంత రిలీఫ్‌ అయ్యారు. కానీ నష్టం పెద్దది కావడంతో ఆయనపై చాలా ప్రభావం చూపించింది.

35
`గేమ్‌ ఛేంజర్‌` విషయంలో తప్పు తనదే

దీనిపై మరోసారి స్పందించారు నిర్మాత దిల్‌ రాజు. ఓ ప్రెస్‌ మీట్‌లో ఆయన మాట్లాడుతూ, `గేమ్‌ ఛేంజర్‌` విషయంలో తప్పు తనదే అని వెల్లడించారు. ఈ సినిమా చేయడం తన జీవితంలో చేసిన పెద్ద తప్పు అని ఆయన వెల్లడించారు. 

ఇది తన తరహా మూవీ కాదన్నారు. రామ్‌ చరణ్‌కి మంచి హిట్‌ మూవీని అందించలేదనే బాధ తనని వెంటాడుతుందని తెలిపారు దిల్‌ రాజు. `గేమ్‌ ఛేంజర్‌` చేయడం తన జీవితంలో చేసిన అతి పెద్ద మిస్టేక్‌ అని ఆయన అన్నారు.

45
తప్పు జరుగుతుందని తెలిసి ఆపలేకపోయా

నాలుగున్నర గంటల సినిమాని రూపొందించడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే పెద్ద దర్శకుడితో మూవీ కావడంతో అందులో ఎక్కువగా జోక్యం చేసుకోలేకపోయామని, తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని ఆపలేకపోయామని తెలిపారు. 

ఇలాంటి సినిమాని తాను చేయకుండా ఉండాల్సిందన్నారు. తాను ఇప్పటి వరకు 60 సినిమాలు తీశానని, కానీ ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు.  ఇది తనకు పెద్ద లెసన్‌ అని ఆయన వెల్లడించారు.

స్టార్‌ డైరెక్టర్‌తో సినిమా చేస్తున్నప్పుడు ముందే కాంట్రాక్ట్ లో స్పష్టమైన పాయింట్లు పెట్టుకుని సినిమా ప్రారంభించాలన్నారు. కానీ ఈమూవీ విషయంలో అలా చేయలేకపోయామని, అందుకే దీన్ని అక్కడితే వదిలేసినట్టు చెప్పారు దిల్‌ రాజు.

55
`గేమ్‌ ఛేంజర్‌`తో వంద కోట్లకుపైగా నష్టపోయిన దిల్‌ రాజు

రామ్‌ చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో `గేమ్‌ ఛేంజర్‌` మూవీ రూపొందిన విషయం తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో అంజలి కీలక పాత్ర పోషించింది. 

శ్రీకాంత్‌, ఎస్‌ జే సూర్య నెగటివ్‌ రోల్స్ చేశారు. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందింది. జీరో కరప్షన్‌, ప్రజల వద్దకే పాలన అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలయ్యింది. 

ఈ మూవీ రూ.250కోట్లు వసూలు చేసింది. సుమారు రూ.140కోట్ల నెట్‌ వచ్చింది. నిర్మాతగా దిల్‌ రాజుకి వంద కోట్లకుపైగా నష్టాలను తెచ్చినట్టు సమాచారం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories