శాంతనుతో బంధం స్నేహానికి మించినది..లవ్‌ ఎఫైర్‌పై శృతి హాసన్‌ క్లారిటీ?

Published : May 03, 2021, 05:40 PM IST

శృతి హాసన్‌ ప్రేమలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. డూడుల్‌ ఆర్టిస్ట్ శాంతనుతో ఆమె ఘాడమైన ప్రేమలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై తాజాగా శృతి హాసన్‌ స్పందించింది. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.   

PREV
17
శాంతనుతో బంధం స్నేహానికి మించినది..లవ్‌ ఎఫైర్‌పై శృతి హాసన్‌ క్లారిటీ?
శృతి హాసన్‌ తన బర్త్ డే సందర్బంగా ప్రియుడిని పరిచయం చేశాను. డూడుల్‌ ఆర్టిస్ట్గ్‌ గా రాణిస్తున్న శాంతను హజారికా ప్రేమలో ఉన్నట్టు హింట్‌ ఇచ్చేసింది. వీరిద్దరు కలిసి ఫోటోలకు పోజులివ్వడం, మరింత క్లోజ్డ్ గా మూవ్‌ అవ్వడంతో వీరి లవ్‌ స్టోరీపై వార్తలు బయటకు వచ్చాయి.

27
ఆ తర్వాత కూడా పలు సందర్భంగా వీరిద్దరు తమ ప్రేమని వ్యక్తం చేసుకున్నారు. శాంతను బర్త్ డే సందర్భంగా శృతి ప్రత్యేకంగా ఆయనకి విషెస్‌ తెలియజేసింది. సర్‌ప్రైజ్‌లు కూడా చేసింది. ఆ సమయంలోనూ వీరిద్దరు ఒకరిపై ఒకరు తమ ప్రేమని కనబర్చుకున్నారు.

37
ఇంత జరిగిన తర్వాత కూడా వీరిద్దరు ప్రేమలో లేరనే ఎలా అనుకోగలరు. అందుకే వీరిద్దరు ప్రేమలో మునిగితేలుతున్నారని ఆమె ఫ్యాన్స్, నెటిజన్లు కన్ఫమ్‌ చేసుకున్నారు.

47
అయితే తాజాగా దీనిపై ఓ సందర్భంలో శృతి హాసన్‌ స్పందించింది. ఓ సారి బ్రేకప్‌ అయిన తర్వాత మళ్లీ ఇలాంటి అవసరమా? అనే కామెంట్లు వినిపించిన నేపథ్యంలో శృతి ఘాటుగా స్పందించింది.

57
ప్రస్తుతం తన లైఫ్‌లో అద్భుతమైన ఫేజ్‌ నడుస్తుందని తెలిపింది. శాంతను బంధం స్నేహానికి మించినది అని తేల్చి చెప్పింది. అంటే స్నేహానికి మించి ఉండేది ప్రేమ కదా. మొత్తానికి శృతి ఇన్‌డైరెక్ట్ గానే తాను ప్రేమలో ఉన్నానని, శాంతను తన బాయ్‌ ఫ్రెండ్‌ అని చెప్పేసింది.

67
ఇదిలా ఉంటే ఇప్పటికే శృతి లవ్‌లో పడి బ్రేకప్‌ చెప్పుకుంది. మైఖేల్‌ కోర్సలే తో కొన్నాళ్లపాటు శృతి డేటింగ్‌ చేసింది. చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. కారణాలేమైనా ఆయనకు బ్రేకప్‌ చెప్పింది. దీంతో కొంత గ్యాప్‌ తీసుకుని ఇటీవల మళ్లీ హీరోయిన్‌గా కెరీర్‌ ప్రారంభించింది. నటిగా బిజీ అవుతున్న సమయంలో ఇప్పుడు శాంతనుతో కలిసి తిరగడం విశేషం.

77
ప్రస్తుతం శృతి ప్రభాస్‌ సరసన `సలార్‌` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు తమిళంలో `లాభం` సినిమా చేస్తుంది. ఇటీవల పవన్‌తో `వకీల్‌సాబ్‌`లో మెరిసిన విషయం తెలిసిందే.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories