బిజినెస్‌ మేన్ ని పెళ్లి చేసుకోబోతున్న త్రిష.. లవ్‌ మ్యారేజ్‌ అంటూ వార్తలు?

Published : May 03, 2021, 04:09 PM ISTUpdated : May 03, 2021, 04:11 PM IST

సీనియర్‌ హీరోయిన్లంతా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. త్రిష కూడా మ్యారేజ్‌కి సిద్ధమైందట. త్వరలోనే ఆమె ఓ బిజినెస్‌మేన్‌ని వివాహం చేసుకోబోతుందని టాక్‌. ఇప్పుడీ వార్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. 

PREV
19
బిజినెస్‌ మేన్ ని పెళ్లి చేసుకోబోతున్న త్రిష.. లవ్‌ మ్యారేజ్‌ అంటూ వార్తలు?
సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న త్రిష త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతుందట. తన సమకాలీకులైన హీరోయిన్లంతా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. దీంతో తాను కూడా మ్యారేజ్‌ చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలని భావిస్తుందట త్రిష.

29
ఓ బిజినెస్‌ మేన్‌ని వివాహం చేసుకునేందుకు త్రిష గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందనే వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం వీరి మ్యారేజ్‌కి సంబంధించిన చర్చలు ఇరు కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్నాయని, కరోనా తగ్గుముఖం పట్టిన వెంటనే మ్యారేజ్‌ తంతుని పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారని ఫ్యామిలీ మెంబర్స్.

39
ఇదిలా ఉంటే త్రిష ఇటీవల తాను పెద్దలు కుదిర్చిన వాడిని పెళ్లి చేసుకోనని, ప్రేమించిన వాడినే చేసుకుంటానని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది త్రిష. దీంతో ఇప్పుడు మ్యారేజ్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందనే వార్తతో.. మరి త్రిష చేసుకోబోయేవాడు ఆమె ప్రేమికుడేనా అనేది ఆసక్తిగా మారింది.

49
రేపు త్రిష బర్త్ డే. ఈ సందర్భంగా ఈ అమ్మడి మ్యారేజ్‌ వార్తలు గుప్పుమనడం మరింత ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది. దీనికి సంబంధించి రేపు(మే4) ఏదైనా హింట్‌, క్లూ దొరుకుతుందేమో చూడాలి.

59
త్రిష ఇప్పటికే వరుణ్‌ మణియన్‌ని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగింది. ఆ తర్వాత ఏంజరిగిందో ఏమో ఆ ఎంగేజ్‌మెంట్‌ని క్యాన్సిల్‌ చేసుకుంది. ఆ తర్వాత కెరీర్‌పై ఫోకస్‌ పెట్టి స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది.

69
అంతకు ముందు హీరో శింబుతోనూ లవ్‌ స్టోరీ సాగించిందీ సన్నజాతి అందం. వీరిద్దరు చాలా రోజులు చెన్నై వీధుల్లో కలియ తిరిగారు. ప్రేమ పాఠాలు చెప్పుకున్నారు. అయితే ఏమైందో ఏమో బ్రేకప్‌ చెప్పుకున్నారు. కొంత కాలం దూరంగా ఉన్నారు.

79
మళ్లీ గతేడాది వీరిద్దరు కలిశారని, మ్యారేజ్‌ చేసుకోబోతున్నారనే ప్రచారం జరిగింది. పెద్దలు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారనే కోలీవుడ్‌లో వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పుడు మరో వ్యక్తి తెరపైకి రావడం గమనార్హం. మరి ఇంతకి త్రిష ఎవరిని పెళ్లి చేసుకుంటుందనేది తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.

89
త్రిష సినిమాల పరంగానూ బిజీగానే ఉంది. ఆమె నటించిన `గర్జనై`, `సతురంగ వెట్టై2`, `రాంగి` చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం `పొన్నియిన్‌ సెల్వన్‌`, `రామ్‌` చిత్రాల్లో నటిస్తుంది త్రిష.

99
ఇదిలా ఉంటే తెలుగులో దాదాపు అందరు స్టార్‌ హీరోలతో నటించింది త్రిష. చిరంజీవితో `స్టాలిన్‌`, బాలకృష్ణతో `లయన్‌`, నాగార్జునతో `కింగ్‌`, వెంకటేష్‌తో `ఆడవారి మాటలకు అర్థాలు వేరులే`, `నమో వెంకటేశా`, పవన్‌తో `తీన్‌మార్‌`, మహేష్‌తో `అతడు`, `సైనికుడు`, ప్రభాస్‌తో `వర్షం`, `పౌర్ణమి`, `బుజ్జిగాడు` ఎన్టీఆర్‌తో `దమ్ము`, రవితేజతో `క్రిష్ణ`, గోపీచంద్‌తో `శంఖం`, నితిన్‌తో `అల్లరి బుల్లోడు` వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే గత కొంత కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటోంది త్రిష.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories