కీర్తి సురేష్.. రెమో, భైరవ, థాన సేర్ంద కూటం వంటి చిత్రాలలో నటించారు. తక్కువ సమయంలోనే విజయ్, సూర్య, ధనుష్ వంటి స్టార్ హీరోలతో జతకట్టారు.
కానీ, కీర్తి సురేష్ కెరీర్‌లో మలుపు తిప్పిన సినిమా మహానటి . సావిత్రి బయోపిక్‌లో కీర్తి సురేష్ అద్భుతంగా నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమాకు ఆమెకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు వచ్చింది.