భర్త కౌగిలిలో రొమాంటిక్ గా.. వెకేషన్ ఫొటోస్ షేర్ చేసిన నితిన్ భార్య షాలిని

Published : Aug 04, 2023, 10:50 AM IST

ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో, అలాగే భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నటిస్తున్నాడు. వక్కంతం వంశీ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. 

PREV
16
భర్త కౌగిలిలో రొమాంటిక్ గా.. వెకేషన్ ఫొటోస్ షేర్ చేసిన నితిన్ భార్య షాలిని

ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో, అలాగే భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నటిస్తున్నాడు. వక్కంతం వంశీ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ఇటీవలే ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే టైటిల్ ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ తో సర్ప్రైజ్ చేసారు. 

26

ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ తో పాటు వెంకీ కుడుముల చిత్రానికి కూడా నితిన్ కమిటయ్యాడు. అయితే ఎక్స్ట్రా మూవీ క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ లో రిలీజ్ కానుంది. ఇదిలా ఉండగా నితిన్ షూటింగ్ కి కొంత గ్యాప్ ఇచ్చిన తన భార్యతో రొమాంటిగా వెడ్డింగ్ యానవర్సరీ సెలెబ్రేట్ చేసుకునేందుకు ఇటీవల బార్సిలోనా వెళ్లిన సంగతి తెలిసిందే. 

36

నాలుగేళ్లపాటు ప్రేమలో ఉన్న నితిన్, షాలిని కందుకూరి 2020 జూలై లో పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి నితిన్, షాలిని మ్యారేజ్ లైఫ్ న్నీ ఆస్వాదిస్తూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. షాలిని తాజాగా తమ వెకేషన్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

46

భర్త కౌగిలిలో రొమాంటిక్ గా ఉన్న పిక్స్ ని షాలిని షేర్ చేసింది. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలకి షాలిని..మూడేళ్లు ఎంతో అందంగా గడిచాయి థాంక్యూ అని కామెంట్ పెట్టింది. 

56

నితిన్, షాలిని ఫొటోస్ కి నెటిజన్లు మోస్ట్ రొమాంటిక్ కపుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. షాలిని తరచుగా సోషల్ మీడియాలో తన బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేస్తూ.. నితిన్ కి సంబంధించిన విశేషాలు కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. 

66

నితిన్ చివరగా మాచర్ల నియోజకవర్గం చిత్రంలో నటించాడు. గత ఏడాది విడుదలైన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచింది. దీనితో నితిన్ ఎక్స్ట్రా మూవీపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నాడు. ఈ చిత్రం నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ లో అతని సోదరి నికిత రెడ్డి నిర్మిస్తున్నారు. 

click me!

Recommended Stories