ఇదిలా ఉంటే.. భూమికా తన తల్లిని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. చిన్న నోట్ రాసుకొచ్చింది. ‘నా తల్లికి చీరకట్టు అంటే చాలా ఇష్టం. చీరలో స్త్రీ చాలా అందంగా, మనోహరంగా కనిపిస్తుందని ఆమె నమ్ముతుంది. కొన్నేళ్లు ఆమె రోజూ చీరలే ధరించే వారు. ఆమె మా నాన్నతో కలిసి ఆర్మీ పార్టీలకూ వెళ్లినా చీరకట్టులోనే వెళ్లేది. మా నాన్న చెప్పేవారు. అమ్మ అందంగా చీరకట్టుకునేదని. మమ్మీ ఇది నీ కోసమే. ప్రతిరోజూ, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను.