Shruti Haasan Marriage:శృతితో మా మ్యారేజ్‌ అయిపోయిందంటూ షాకిచ్చిన ప్రియుడు శాంతను.. హాట్‌ టాపిక్‌

Published : Mar 24, 2022, 07:56 AM IST

స్టార్‌ హీరోయిన్‌ శృతి హాసన్‌ తన అభిమానులకు షాకిచ్చింది. ఇప్పటికే పెళ్లైయిపోయిందంటూ ప్రియుడు చెప్పిన విషయం ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతుంది. దీంతో ఇది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

PREV
16
Shruti Haasan Marriage:శృతితో మా మ్యారేజ్‌ అయిపోయిందంటూ షాకిచ్చిన ప్రియుడు శాంతను.. హాట్‌ టాపిక్‌
shruti haasan santanu married

లోకనాయకుడు కమల్‌ హాసన్‌ తనయ, స్టార్‌ హీరోయిన్‌ శృతి హాసన్‌, డూడుల్‌ ఆర్టిస్ట్ శాంతను హజారికా ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే. అంతకు ముందే ప్రేమలో పడ్డ శృతి.. ఆ లవ్‌ స్టోరీ బ్రేకప్‌ తర్వాత కొంత గ్యాప్‌తో శాంతనుతో ప్రేమలో పడింది. గత లాక్‌ డౌన్‌ టైమ్‌ నుంచి వీరిద్దరు ఘాటుగా ప్రేమించుకుంటున్నారు. శృతి పుట్టిన రోజున శాంతను స్పెషల్‌గా మెరవడంతో అంతా వీరిద్దరు ప్రేమలో పడినట్టు భావించారు. దాన్ని నిజం చేస్తూ క్రమంగా ఇద్దరూ కలిసి తిరిగిన ఫోటోలు వైరల్‌గా మారాయి. అంతేకాదు కొన్ని రోజులు కలిసి ఒకే ఇంట్లో ఉన్నట్టు వార్తలొచ్చాయి. 

26
shruti haasan santanu married

ఇటీవల ఎక్కడ చూసిన వీరిద్దరు జోడీగా కనిపిస్తున్నారు. తాను ప్రేమలో పడ్డాననే విషయాన్ని శృతి కూడా పరోక్షంగా ఒప్పుకుంది. ఇదిలా ఉంటే తాజాగా వీరిద్దరు పెళ్లి కూడా చేసుకున్నారట. ఈ విషయాన్ని ప్రియుడు శాంతను హజారికా చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. క్రియేటివ్‌గా తమ మ్యారేజ్‌ అయిపోయిందంటూ ఆయన ట్విస్ట్ ఇచ్చారు. 

36
shruti haasan santanu married

డూడుల్‌ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న శాంతను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శృతి హాసన్‌తో తమ రిలేషన్‌పై ఓపెన్‌ అయ్యాడు. క్రియేటివ్‌గా మా(శృతి,శాంతను) పెళ్లి జరిగిపోయింది. అందుకు ఓ నిదర్శనం మా బలమైన బంధం. మేమిద్దరం క్రియేటివ్‌ పీపుల్‌. ఇద్దరం కలిసి కొత్త కొత్త విషయాలను క్రియేట్‌ చేయాలనుకుంటాం. నా జీవితంలో శృతి ఎంతో స్ఫూర్తిని నింపింది. నన్ను చూసి తను ఇన్‌స్పైర్‌ అవుతుంటుంది. మా క్రియేటివ్‌ థాట్స్ కూడా ఒకేలా ఉంటాయి. ప్రత్యక్ష వివాహం ఎప్పుడు జరుగుతుందో తెలియదు` అని తెలిపారు. 

46
shruti haasan santanu married

తమ ఆలోచలు ఒకేలా ఉంటాయని, తమ ఆలోచనల ప్రకారం తమ మ్యారేజ్‌ ఇప్పటికే జరిగిపోయిందనే కోణంలో శాంతను ఈ విషయాన్ని వెల్లడించారు. అంటే ఆయన చెప్పినదాన్ని ప్రకారం వీరిద్దరు మ్యారేజ్‌ చేసుకునే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మరి వీరి బంధం నిజంగానే పెళ్లి వరకు వెళ్తుందా? లేదా ఏదైనా ట్విస్ట్ చోటు చేసుకుంటుందా? అనేది చూడాలి. కానీ వీరిద్దరు మాత్రం ఇప్పుడు చెట్టాపట్టాలేసుకుని షికార్‌ కెళ్తున్నారు. అన్‌లిమిటెడ్‌గా ఎంజాయ్‌ చేస్తున్నారు.

56
shruti haasan santanu married

కమల్‌ తనయగా తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటుంది శృతి హాసన్‌. ఆమె నటిగానే కాదు, మ్యూజిషీయన్‌గా, సింగర్‌గా రాణిస్తుంది. క్రియేటివ్‌ సైడ్‌ తనలోని కొత్త యాంగిల్స్ ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుంది. ఆ మధ్య హీరోయిన్‌గా సినిమాలు మానేసి, సంగీతంపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. పలు మ్యూజిక్‌ షోలు కూడా నిర్వహించారు. 
 

66
shruti haasan santanu married

కొంత గ్యాప్‌ తర్వాత మళ్లీ హీరోయిన్‌గా రీఎంట్రీ ఇచ్చింది శృతి. రవితేజతో `క్రాక్‌`లో నటించి హిట్‌ని అందుకుంది. ఆ తర్వాత పవన్‌తో `వకీల్‌సాబ్‌`లో మెరిసింది. ప్రస్తుతం మూడు భారీ సినిమాల్లో భాగమైంది శృతి. చిరంజీవితో `మెగా 154`లో, బాలకృష్ణతో `ఎన్బీకే 107`లో, ప్రభాస్‌తో `సలార్‌`లో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రాల కోసం పారితోషికం కూడా భారీగానే అందుకుంటోందట శృతి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories