Krithi shetty:చిలక పచ్చ చీర, స్లీవ్ లెస్ జాకెట్.. సాంప్రదాయ కట్టులో సూపర్ సెక్సీగా దర్శనమిచ్చిన కృతి శెట్టి

Published : Mar 23, 2022, 08:30 PM ISTUpdated : Mar 23, 2022, 08:31 PM IST

అందం, అభినయం, అదృష్టం ఇది రేర్ కాంబినేషన్. ఈ మూడు ఉంటే చాలు ఓవర్ నైట్ స్టార్ అయిపోవచ్చు. సమంత, రష్మిక (Rashmika Mandanna)లాంటి హీరోయిన్స్ ఈ కోవకే చెందుతారు. తాజాగా ఈ లిస్ట్ లో చేరింది ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి. ఇరవై ఏళ్ళు  నిండకుండానే కృతి టాలీవుడ్ ని ఊపేస్తుంది.

PREV
16
Krithi shetty:చిలక పచ్చ చీర, స్లీవ్ లెస్ జాకెట్.. సాంప్రదాయ కట్టులో సూపర్ సెక్సీగా దర్శనమిచ్చిన కృతి శెట్టి
krithi shetty

అందం, అభినయం, అదృష్టం ఇది రేర్ కాంబినేషన్. ఈ మూడు ఉంటే చాలు ఓవర్ నైట్ స్టార్ అయిపోవచ్చు. సమంత, రష్మిక (Rashmika Mandanna)లాంటి హీరోయిన్స్ ఈ కోవకే చెందుతారు. తాజాగా ఈ లిస్ట్ లో చేరింది ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి. ఇరవై ఏళ్ళు  నిండకుండానే కృతి టాలీవుడ్ ని ఊపేస్తుంది.

26
krithi shetty

మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కృతి (Kriti shetty)దెబ్బకు స్టార్డం తెచ్చుకుంది. ఉప్పెన విజయంలో సింహ భాగం కృతి శెట్టిదే. తన వయసుకు పాత్రలో  కృతి చాలా సహజంగా అనిపించింది. చేపకళ్ళు, చొట్ట బుగ్గలకు తోడు మెస్మరైజ్ చేసే ముఖకవళికలు కుర్రకారుకు నిద్ర లేకుండా చేశాయి. 
 
36
krithi shetty

చిన్న చిత్రంగా విడుదలైన ఉప్పెన స్టార్ హీరో మూవీ రేంజ్ వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను షాక్ కి గురిచేసింది. ఉప్పెన వరల్డ్ వైడ్ గా వంద కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టడం ఊహించని పరిణామం. ఉప్పెన విజయం నేపథ్యంలో కృతి శెట్టికి టాలీవుడ్ లో అవకాశాలు వరుస కట్టాయి.

46
krithi shetty

ఇక  శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy) మూవీతో సెకండ్ హిట్ తన ఖాతాలో వేసుకుంది ఈ యంగ్ హీరోయిన్.  ఇక శ్యామ్ సింగరాయ్ మూవీలో ఒకింత హద్దులు దాటి బోల్డ్ సన్నివేశాల్లో నటించారు. నానికి లిప్ లాక్స్ ఇవ్వడంతో పాటు బెడ్ సీన్స్ లో నటించింది.

56
krithi shetty

అలాగే బంగార్రాజు హిట్ తో కృతి హ్యాట్రిక్ పూర్తి చేసింది. వరుసగా మూడు హిట్ చిత్రాలలో నటించిన హీరోయిన్  రికార్డులకు ఎక్కింది. బంగార్రాజు మూవీలో కృతి పల్లెటూరు అమ్మాయి పాత్రలో కనువిందు చేశారు. నాగార్జున-నాగ చైతన్యల మల్టీస్టారర్ బంగార్రాజు చిత్రంలో కృతి నాగలక్ష్మి అనే పాత్ర చేశారు. 

66
krithi shetty

ఇక వరుసగా చిత్రాలకు సైన్ చేస్తున్న కృతి నెక్స్ట్  హీరో సుధీర్ కి జంటగా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే మూవీలో నటిస్తున్నారు. రామ్-లింగుస్వామి కాంబినేషన్ లో రూపొందుతున్న బైలింగ్వెల్ మూవీ వారియర్ మూవీలో నటిస్తున్నారు. నితిన్ కి జంటగా మాచర్ల నియోజకవర్గం మూవీలో నటిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories