12ఏళ్ల క్రితం నేను ఏమి చేస్తున్నానో నాకే తెలియదు.. ఐతే ఇష్టపడ్డాను, ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకున్న శృతి

First Published Jul 25, 2021, 11:37 AM IST

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నట వారసురాలిగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ స్టార్ హీరోయిన్ హోదా సంపాదించి, ఆయన పేరు నిలబెట్టింది. తండ్రి మాదిరి శృతి కూడా మల్టీ టాలెంటెడ్. ఆమె సింగర్, రైటర్, యాక్టర్. 

విదేశాలలో లైవ్ మ్యూజిక్ షోలు ఇచ్చిన ఘనత ఆమెది. వెస్ట్రన్ మ్యూజిక్ పై శృతికి మంచి పట్టు ఉంది. 2019లో లండల్ లో వరుసగా లైవ్ మ్యూజిక్ ఈవెంట్స్ నిర్వహించారు. కాగా 12ఏళ్ల క్రితం తాను స్టేజ్ పై సాంగ్స్ పాడుతున్న ఫోటో పంచుకున్న శృతి ఎమోషనల్ కామెంట్ చేశారు.
undefined
12ఏళ్ల క్రితం నేను ఏమి చేస్తున్నానో నాకు ఐడియా లేదు, కానీ ఒక్కటి మాత్రం నిజం నేను దానిని ఇష్టపడుతున్నాను. రోజురోజుకు పరిణితి సాధిస్తున్నాను. 12ఏళ్లలో చాలా మారిపోయింది. అయినా ఆ మార్పును నేను ఫీల్ అవుతున్నాడు. మీ సపోర్ట్ కి కృతజ్ఞతలు అంటూ శృతి, కామెంట్ చేశారు.
undefined
సినిమాలలోకి రాక ముందు నుండే శృతి మ్యూజిక్ షోలు చేసేవారు. అప్పటి జ్ఞాపకాలు ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ సారి నెమరు వేసుకున్నారు. గబ్బర్ సింగ్, రేసు గుర్రం, శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో టాలీవుడ్ నంబర్ వన్ హీరోయిన్ హోదా దక్కించుకుంది.
undefined
శృతి ప్రేమ కోసం కెరీర్ ని వదిలేసింది. మంచి ఫార్మ్ లో ఉన్న సమయంలో లండన్ కి చెందిన మైఖేల్ కోర్స్లే తో పీకల లోతు ప్రేమాయణం సాగించారు. 2019లో అనూహ్యంగా బ్రేకప్ చెప్పుకున్నారు.
undefined
లండన్ ప్రియుడితో బ్రేకప్ అయ్యి ఏడాది ముగిసిందో లేదో కొత్త ప్రియుడ్ని పట్టేసింది. ముంబై కి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో డేటింగ్ చేస్తున్న శృతి, అతనితోనే కలిసి ఉంటుందని సమాచారం.
undefined
తరచుగా ప్రియుడు హజారికతో దిగిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది. మేమిద్దరం ప్రేమికులం అని చెప్పుకున్నా, ముద్దులతో, హగ్గులతో రెచ్చిపోతూ పరోక్షంగా తమ బంధాన్ని లోకానికి తెలియజేస్తున్నారు.
undefined
మరోవైపు సలార్ వంటి భారీ ప్రాజెక్ట్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా, పాన్ ఇండియా మూవీగా 2022 సమ్మర్ లో విడుదల కానుంది.
undefined
click me!