బ్యూటీఫుల్ హీరోయిన్ శ్రద్ధా దాస్ (Shraddha Das) మొన్నటి వరకు తెలుగు టీవీ షోల్లో సందడి చేసిన విషయం తెలిసిందే. ‘ఢీ’ రియాలిటీ షోతో తెలుగు ఆడియెన్స్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతకు ముందే నటిగా ప్రేక్షకులను అలరించింది.
నార్త్ బ్యూటీ అయినా శ్రద్ధా దాస్ తన కెరీర్ ను టాలీవుడ్ నుంచే ప్రారంభించింది. ఆమె నటించిన తొలి చిత్రం అల్లరి నరేష్ ‘సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం’. ఈ చిత్రంతో హీరోయిన్ గా అవకాశం అందుకుని తెలుగు వారిని పరిచయం చేసుకుంది.. వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత ‘ఆర్య2’, ‘డార్లింగ్’, ‘గుంటూరు టాకీస్’ వంటి చిత్రాలతో మరింత క్రేజ్ దక్కించుకుంది. అటు హిందీ, మలయాళం, బెంగాళీ, కన్నడ చిత్రాల్లోనూ నటించింది. కానీ స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం చిన్న చిన్న ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది.
ముఖ్యంగా శ్రద్ధా దాస్ నెట్టింట చేసే సందడి అంతాఇంతా కాదు. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో అడుగుపెడితే అందాల దుమారం ఖాయం. అయితే తాజాగా కొన్ని స్టన్నింగ్ ఫొటోలను పంచుకుంది. జియో వరల్డ్ గార్డెన్ లో జరిగిన బాలీవుడ్ మ్యూజిక్ ప్రాజెక్ట్ ఈవెంట్ లో సందడి చేసింది.
రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ లైవ్ పెర్ఫామెన్స్ లో పాల్గొంది. సమంత నటించిన సెన్సేషన్ సాంగ్ ‘ఊ అంటావా మావా’ సాంగ్ కు దేవీతో కలిసి చిందులేసింది. అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకుంది. అలాగే అదే అవుట్ ఫిట్ లో కిర్రాక్ గా ఫొటోషూట్ చేసింది.
పొట్టి డ్రెస్ లో మతులుపోయేలా ఫొటోలకు ఫోజులిచ్చింది. థండర్ థైస్ కనిపించేలా స్టిల్స్ ఇస్తూ కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. మత్తెక్కించే ఫోజులతో మతులు చెడగొట్టింది. అందాల ప్రదర్శనతో చూపుతిప్పుకోకుండా చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.