Namrata Shirodkar: గ్లామర్ డోస్ పెంచేసిన మహేష్ వైఫ్ నమ్రత... ఆ రోజులు గుర్తు చేసేలా క్రేజీ ఫోటో షూట్!

Published : Nov 06, 2023, 01:57 PM IST

నమ్రత శిరోద్కర్ వరుస ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తుంది. మహేష్ బాబు వైఫ్ సైతం గ్లామర్ డోస్ పెంచేస్తుంది. నమ్రత తాజా ఫోటో షూట్ వైరల్ అవుతుంది.   

PREV
16
Namrata Shirodkar: గ్లామర్ డోస్ పెంచేసిన మహేష్ వైఫ్ నమ్రత... ఆ రోజులు గుర్తు చేసేలా క్రేజీ ఫోటో షూట్!
Namrata Shirodkar


నమ్రత శిరోద్కర్ ఫిట్నెస్ ఫ్రీక్. అందం చెక్కు చేరకుండా కాపాడుకుంటుంది. ప్రతిరోజూ వ్యాయామం, క్రమశిక్షణతో కూడిన ఆహారం తీసుకుంటూ గ్లామరస్ గా తయారవుతుంది. నమ్రత వయసు 50 ఏళ్ళు అంటే నమ్మడం కష్టమే. 
 

26
Namrata Shirodkar

నమ్రతను మహేష్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2005లో అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా నమ్రత వివాహం జరిగింది. నమ్రత కోడలుగా రావడం కృష్ణకు ఇష్టం లేదనే ప్రచారం జరిగింది. పట్టుబట్టి నమ్రతను మహేష్ భార్యగా తెచ్చుకున్నారు. 

36
Namrata Shirodkar

వయసులో నమ్రత మహేష్ కంటే పెద్దది కావడం విశేషం. పెళ్లయ్యాక నమ్రత నటనకు గుడ్ బై చెప్పింది. ఆమె గృహిణిగా మారిపోయింది. మహేష్-నమ్రతలకు గౌతమ్, సితార సంతానం. గౌతమ్ టీనేజ్ లో ఉన్నాడు. సితార అప్పుడే సెలెబ్రిటీ హోదా అనుభవిస్తుంది. 

 

46
Namrata Shirodkar

పిల్లలు పెద్దయ్యే వరకు నమ్రత ఇంటి విషయాలకే పరిమితం అయ్యారు. కొన్నాళ్లుగా మహేష్ బాబుకు ఆమె సలహాదారుగా పని చేస్తున్నారు. మహేష్ సంపాదన పలు వ్యాపారాల్లో పెట్టుబడిగా పెడుతున్నారు. అలాగే మహేష్ బాబు పేరిట సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. 

56
Namrata Shirodkar


మహేష్ సక్సెస్ లో నమ్రత పాత్ర ఎంతగానో ఉంది. ఇక టాలీవుడ్ బెస్ట్ కపుల్ గా మహేష్-నమ్రత నిలిచారు. మహేష్ పక్కా ఫ్యామిలీ మ్యాన్. సినిమా, కుటుంబమే తన ప్రపంచం. ఏడాదిలో పలుమార్లు కుటుంబంతో పాటు వెకేషన్ కి వెళతారు. 


 

66

మహేష్, నమ్రత ఇద్దరు పిల్లలతో పాటు ప్రపంచం చుట్టేశారు. ఎక్కువగా దుబాయ్, యూఎస్, ఫ్రాన్స్ వెళుతుంటారు. ఇంట్లో ఉంటే మహేష్ సితార, మహేష్ లతో సరదా ఆటలు ఆడుతూ గడిపేస్తారు. కాగా గత ఏడాది మహేష్ కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. కృష్ణ, ఇందిరాదేవి, రమేష్ బాబు కన్నుమూశారు.. 

click me!

Recommended Stories