పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై ప్రస్తుతం వేల కోట్లల్లో బిజినెస్ జరుగుతోంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న చిత్రాలన్నీ భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీస్ కావడం విశేషం. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె ఇలా ప్రభాస్ నటిస్తున్న చిత్రాలన్నీ ఆషామాషీ చిత్రాలు కావు. ఇంతటి భారీ చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ ప్రభాస్ లో కొంచెం కూడా అలసట, విసుగు కనిపించడం లేదు.