రష్మిక కెరీర్‌ని మలుపుతిప్పిన `పుష్ప`.. ఆ భారీ ఆఫర్ కి కారణమదే అంటూ అసలు రహస్యం బయటపెట్టిన నేషనల్‌ క్రష్‌

Published : Jul 01, 2022, 02:34 PM IST

క్యూట్‌ బ్యూటీ నుంచి హాట్‌ బ్యూటీగా టర్న్ తీసుకున్న రష్మిక మందన్నా తన కెరీర్‌ మలుపు తిప్పిన విషయాన్ని పంచుకుంది. `పుష్ప` చిత్రం తన సినీ కెరీర్‌కి బిగ్గెస్ట్ టర్నింగ్‌ పాయింట్‌ అని తెలిపింది.  

PREV
15
రష్మిక కెరీర్‌ని మలుపుతిప్పిన `పుష్ప`.. ఆ భారీ ఆఫర్ కి కారణమదే అంటూ అసలు రహస్యం బయటపెట్టిన నేషనల్‌ క్రష్‌

నేషనల్‌ క్రష్‌గా(National Crush) పాపులర్‌ అయ్యింది రష్మిక మందన్నా(Rashmika Mandanna). హాట్‌ అందాలు, క్యూట్‌ ఎక్స్ ప్రెషన్స్, చలాకీతనం రష్మిక సొంతం. అందుకే చాలా ఫాస్ట్ గా స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. టాలీవుడ్‌ హీరోయిన్లలో నెంబర్‌ గేమ్‌లో టాప్‌లో నిలిచింది. దశాబ్దంకిపైగా ఉన్న హీరోయిన్లని సైతం వెనక్కి నెట్టి తను ముందు వరుసలో నిలిచింది. `ఛలో`, `గీతగోవిందం` చిత్రాలతో విజయాలు అందుకుని స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. ఇటీవల `పుష్ప`(Pushpa) చిత్రంతో పాన్‌ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది రష్మిక.

25

అల్లు అర్జున్‌తో కలిసి నటించిన `పుష్ప` చిత్రం పాన్‌ ఇండియా లెవల్‌లో సత్తా చాటడంతో ఆ సక్సెస్‌తోపాటు రష్మికకి నేషనల్‌ వైడ్‌ పాపులారిటీ రావడం విశేషం. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళం, హిందీ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తెలుగులో `పుష్ప2`లో నటించబోతుంది. విజయ్‌తో తెలుగు, తమిళంలో `వారసుడు` చిత్రంలో చేస్తుంది రష్మిక మందన్నా. మరోవైపు హిందీలో మూడు సినిమాలతో బిజీగా ఉంది. `గుడ్‌బై`, `మిషన్‌ మజ్ను` విడుదలకు రెడీ అవుతున్నాయి. రణ్‌బీర్‌ కపూర్‌తో నటిస్తున్న `యానిమల్‌` (Animal) చిత్రీకరణ జరుపుకుంటోంది. 
 

35

`అర్జున్‌రెడ్డి` ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `యానిమల్‌`. బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ బడ్జెట్‌ చిత్రం. రష్మికకి హిందీలో భారీ ప్రాజెక్ట్. ఈ సినిమాతో ఆమె నార్త్ లో నెక్ట్స్ లెవల్‌ హీరోయిన్‌గా ఎదగబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్‌లో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రష్మిక మందన్నా. తనకు `యానిమల్‌` వంటి భారీ ఆఫర్‌ రావడానికి `పుష్ప` చిత్రమే కారణమని తెలిపింది. 
 

45

`పుష్ప` చిత్రం తన కెరీర్‌లో పెద్ద టర్నింగ్‌ పాయింట్‌ అని చెప్పింది. ఈ చిత్రంలో తన నటన చూసే `యానిమల్‌` మేకర్స్ తనని సంప్రదించారట. ఈ సినిమాతో ఆడియెన్స్ తనలోని మరో కొత్త యాంగిల్‌ని చూస్తారని తెలిపింది. అందుకే ఇందులో నటించేందుకు ఓకే చెప్పిందట. తనకిది మరో మెట్టు ఎక్కించే చిత్రమవుతుందని తెలిపింది రష్మిక మందన్నా. `యానిమల్‌`లో నేషనల్‌ క్రష్‌ పాత్ర బలంగా ఉంటుందని తెలుస్తుంది. దీన్ని పాన్‌ ఇండియా చిత్రంగా విడుదల చేయబోతున్నారు.
 

55

ఇక `పుష్ప` చిత్రంలో రష్మక మందన్నా.. శ్రీవల్లి పాత్రలో నటించింది. పుష్పరాజ్‌(బన్నీ)కి జోడీగా డీ గ్లామర్‌ పాత్రలో నటించి వాహ్‌ అనిపించింది. పల్లెటూరి అమ్మాయిగా రష్మిక పాత్రలో ఒదిగిపోయిన తీరు అందరి నుంచి ప్రశంసలు దక్కేలా చేశాయి. పైగా ఆమె చేసే డాన్సులు హైలైట్‌ అయ్యాయి. ఇప్పుడు సౌత్‌, నార్త్ లో `శ్రీవల్లి`గా ముద్ర వేసుకుంది రష్మిక మందన్నా. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories