‘భార‌తీయుడు 2’ కమల్ క్యారక్టర్ పై షాకిచ్చే న్యూస్, తేడా కొడుతోందే

Published : Jun 03, 2024, 02:49 PM IST

కమల్-శంకర్ కలిసి 1996లో వచ్చిన 'భారతీయుడు'కి సీక్వెల్ తీశారు. జులై 12న థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. రీసెంట్‌గా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు.

PREV
112
‘భార‌తీయుడు 2’ కమల్ క్యారక్టర్ పై షాకిచ్చే న్యూస్, తేడా కొడుతోందే
Indian 2


యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌ (Kamal Haasan), సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ (Shankar) కాంబినేష‌న్‌లో రూపొందుతున్న  భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’ (Bharateeyudu 2). టాప్ ప్రొడక్షన్ హౌస్  లైకా ప్రొడ‌క్ష‌న్స్‌ (Lyca Productions)తో పాటు.. రెడ్ జెయింట్ (Red Giant) బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మిస్తోన్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే తాజాగా ఈ చిత్రం గురించి ఓ న్యూస్ స్ప్రెడ్ అవుతూ అభిమానులను కంగారు పెడుతోంది. 

212


లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన 'విక్రమ్' సినిమాతో విలక్షణ నటుడు కమల్ హాసన్ అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు. చాలా ఏళ్ల తర్వాత బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు. ఈ సినిమాతో అనేక భారీ చిత్రాల్లో భాగమయ్యారు. వీటిలో ఒకటే 'ఇండియన్ 2'. 'భారతీయుడు' మూవీకి సీక్వెల్ ఇది. దాదాపు 28 ఏళ్ల తర్వాత మళ్లీ అదే దర్శకుడు-హీరో కలిసి పనిచేశారు.  అయితే ఆ స్దాయిలో అంచనాలు అయితే లేవు.   అందుకు కారణం చాలా ఏళ్ల తర్వాత సీక్వెల్ చేయటం కావచ్చు. 
 

312
#Indian2


 కమల్-శంకర్ కలిసి 1996లో వచ్చిన 'భారతీయుడు'కి సీక్వెల్ తీశారు. జులై 12న థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. రీసెంట్‌గా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు.ఈ మూవీలో హీరోయిన్ కాజల్ సీన్స్ ఏం లేవంట. అంటే సేనాపతికి భార్య క్యారెక్టర్ ఉండదేమో? అలానే తమిళంలో బజ్ ఎలా ఉందో గానీ తెలుగులో మాత్రం పెద్దగా లేదు. ఇప్పటివరకు శంకర్ మార్క్ ఎక్కడా కనిపించట్లేదనే టాక్ ఉంది.  అయితే అక్కడతో ఆగిపోతే ఫరవాలేదు.

412
#Indian2


 ‘భారతీయుడు 2’లో స‌రికొత్త టాక్ తమిళ సినీ వర్గాల్లో వినపడుతోంది. ఈ సినిమాలో క‌మ‌ల్ హాస‌న్ క‌నిపించేది ఎక్కువ సేపు కాదని అంటున్నారు. మరి సినిమా అంతా ఎవరు ఉంటారు అంటే  ‘భార‌య‌తీయుడు 2’ మొత్తం సిద్దార్థ్ చుట్టూ న‌డిచే క‌థ  అని ఇన్ సైడ్   టాక్‌. , అక్క‌డ‌క్క‌డ మాత్ర‌మే క‌మ‌ల్ కనపడతాడని అంటున్నారు.  ప్రీ క్లైమాక్స్ సమయంలో పూర్తి స్దాయి కమల్ దిగుతాడని చెప్తున్నారు. ఓ కొత్త రకం స్క్రీన్ ప్లేతో ఈ సినిమాని డిజైన్ చేసినట్లు వినికిడి. అది వర్కవుట్ అయితే కొత్తగా ఉంటుందిట. కమల్ కనపడకపోయినా మనం ఫీల్ అవుతూంటాం అని చెప్తున్నారు. 

512

indian 2


అయితే ఇన్నాళ్లూ కమల్ తీసిన ఫుటేజ్ ఏమైంది అంటే...ఆ క‌మ‌ల్ పోర్ష‌న్ అంతా `భార‌తీయుడు 3` వాడతారని చెప్పుకుంటున్నారు. ఈ లెక్కన చూస్తే  ‘భార‌తీయుడు 2’ పూర్తిగా సిద్దార్థ్ సినిమా అంటున్నారు. అయితే ఇందులో ఎంతవరకూ నిజమో తెలియాలి. ఇలా చేయటానికి కారణం బిజినెస్ లెక్కలే అంటున్నారు. బడ్జెట్ అనుకున్న స్దాయిని దాటి పోవటంతో దాని రికవరీకి ఇలా రెండు ముక్కలు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.  అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

612


 హీరో కమల్‌హాసన్‌ మాట్లాడుతూ.. ‘‘28 ఏళ్ల క్రితం నేను శివాజీ గణేశన్‌తో ఓ సినిమా చేద్దామనుకుంటున్న సమయంలోనే శంకర్‌ ‘భారతీయుడు’ కథతో నా దగ్గరకు వచ్చారు. ఆ కథలు రెండూ కొంచెం దగ్గరగా ఉండటంతో శివాజీ గణేశన్‌కు చెప్పా. ఆయన ‘శంకర్‌తోనే సినిమా చేయండి.. మనం ఇప్పటికే ఎన్నో చిత్రాలు కలిసి చేశామ’ని నాతో అన్నారు. ఆ ఒక్క మాట, నమ్మకంతో ‘భారతీయుడు’ చేశా. 
 

712

Indian2


అప్పట్లోనే నేను సీక్వెల్‌ చేద్దామని అడిగా. కానీ, శంకర్‌ కథ రెడీగా లేదన్నారు. మళ్లీ 28ఏళ్లకు ‘భారతీయుడు 2’ చేశాం. నిర్మాత సుభాస్కరన్‌ వల్లే ఈ చిత్రం ఇక్కడి వరకు వచ్చింది. ఆయన మాపై పెట్టిన నమ్మకమే ఈ సినిమా. అనిరుధ్‌ దీనికి అద్భుతమైన సంగీతమందించారు’’ అన్నారు. 

812
Indian 2


‘‘భారతీయుడు తాత మంచి వాళ్లకు మంచివాడు.. చెడ్డవాళ్లకు చెడ్డవాడు. కమల్‌హాసన్‌ 360డిగ్రీల కంటే ఒక డిగ్రీ ఎక్కువ నటించే సత్తా ఉన్న నటుడు. 70 రోజుల పాటు మేకప్‌తో నటించారు. ఆయన లాంటి నటుడు ప్రపంచంలోనే లేరు. తనతో ‘భారతీయుడు 2’, ‘భారతీయుడు 3’ చేయడం ఆనందంగా ఉంది. ఈ రెండూ ‘భారతీయుడు’ కంటే పెద్ద హిట్‌ అవుతాయి’’ అన్నారు దర్శకుడు శంకర్‌. 

912
Indian 2


రకుల్‌ప్రీత్‌ సింగ్, సిద్ధార్థ్, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా జులై 12న విడుదల కానుంది.  ఈ చిత్రం తెలుగు బిజినెస్ బాగా జరిగినట్లు తెలుస్తోంది. కమల్ గత చిత్రం విక్రమ్ సినిమా 8 నుంచి 10 కోట్లకు అమ్ముడైతే, ఇప్పుడు ‘భార‌తీయుడు 2’ మాత్రం ఓ రేంజిలో అమ్ముడైంది. 

1012
Kamal Haasans Indian 2 film update out


ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రాన్ని 22 కోట్లకు అమ్మటం జరిగింది. ఇది కమల్ గత చిత్రానికి రెట్టింపు రేటు కావటం విశేషంగా చెప్తున్నారు. అయితే  ఈ సినిమా  నైజాం,ఆంధ్రా రైట్స్ ని (సీడెడ్ మినహా) ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి (సురేష్ ప్రొడక్షన్స్ & ఏషియన్ సినిమాస్) వారు దక్కించుకున్నారు. అడ్వాన్స్ ఇచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్  కాదట. అయితే అడ్వాన్స్ ఎంత మొత్తం ఇచ్చారు అనేది బయటికి బయిటకు రాలేదు.  ఇక సీడెడ్ ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ పై ఎన్.వి. ప్రసాద్ రైట్స్ తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు.  ఓవర్ సీస్ తెలుగు వెర్షన్ రైట్స్ కూడా భారీగానే వెళ్లాయి. అన్ని కలిపి 22 కోట్లు అని చెప్తున్నారు. 
 

1112
Indian 2


 ‘భార‌తీయుడు 2’ స్టోరీ లైన్ ని గ‌మ‌నిస్తే.. ‘భార‌తీయుడు’లో లంచానికి వ్య‌తిరేకంగా పోరాడిన వీర‌శేఖ‌రన్ సేనాప‌తి ఇండియాలో మ‌ళ్లీ త‌ప్పు జ‌రిగితే తాను తిరిగి వ‌స్తాన‌ని చెప్ప‌టంతో క‌థ ముగిసింది. అయితే ఇప్పుడు మ‌ళ్లీ దేశంలో లంచ‌గొండిత‌నం పెరిగిపోతోంది. లంచం లేనిదే అధికారులు ఎవ‌రూ ఏ ప‌నులు చేయ‌టం లేదు. దీంతో సామాన్యుడు బ‌త‌క‌ట‌మే క‌ష్టంగా మారింది. అప్పుడు భార‌తీయులంద‌రూ క‌మ్ బ్యాక్ ఇండియ‌న్ అంటూ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి మ‌ళ్లీ దేశంలోకి భార‌తీయుడు అడుగు పెట్టాల‌ని రిక్వెస్టులు పంపుతారు. చివ‌ర‌కు వీర‌శేఖ‌ర‌న్ సేనాప‌తి ఇండియాలోకి అడుగు పెడ‌తారు.( Bharateeyudu 2)

1212


ఇండియా వ‌చ్చిన త‌ర్వాత సేనాప‌తి ఏం చేశారు.. భార‌తీయుడుకి భ‌య‌ప‌డి లంచాలు మానేసిన అధికార‌లు మ‌ళ్లీ లంచాలు తీసుకోవ‌టానికి కార‌ణం ఎవ‌రు? పేట్రేగిన లంచం వ‌ల్ల దేశంలో ఎలాంటి అల్ల‌క‌ల్లోలాలు జ‌రిగాయి. అనే విష‌యాల‌ను ఈ సినిమాలో చాలా గ్రాండియ‌ర్‌గా చూపించనున్నారు డైరెక్ట‌ర్ శంక‌ర్‌. రిలీజైన గ్లింప్స్‌లోనే ఓ రేంజ్ గ్రాండియ‌ర్‌నెస్ ఉంటే ఇక సినిమాలో ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వసరం లేదు. సినిమా మేకింగ్‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లిన డైరెక్ట‌ర్ శంక‌ర్, ఈసారి ‘భార‌తీయుడు 2’ చిత్రంతో ఎలాంటి సెన్సేష‌న్స్‌కు తెర తీయ‌బోతున్నారో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే . ర‌వివ‌ర్మ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు.
 

click me!

Recommended Stories