నాగార్జున అంత ఆస్తి ఎలా సంపాదించారో తెలుసా.. సీక్రెట్ రివీల్ చేస్తూ జగపతి బాబు ఓపెన్ కామెంట్స్

Published : Jun 03, 2024, 02:45 PM IST

టాలీవుడ్ లో రిచెస్ట్ హీరోల్లో నాగార్జున పేరు ముందుగా చెప్పుకోవచ్చు. నాగార్జున హీరోగా రాణిస్తూనే అనేక వ్యాపారాల్లో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ లకు తీసిపోని విధంగా సంపాదిస్తున్నారు. నాగార్జునకి వేలకోట్ల ఆస్తులు ఉన్నాయనేది ఇండస్ట్రీలో టాక్.

PREV
16
నాగార్జున అంత ఆస్తి ఎలా సంపాదించారో తెలుసా.. సీక్రెట్ రివీల్ చేస్తూ జగపతి బాబు ఓపెన్ కామెంట్స్

టాలీవుడ్ లో రిచెస్ట్ హీరోల్లో నాగార్జున పేరు ముందుగా చెప్పుకోవచ్చు. నాగార్జున హీరోగా రాణిస్తూనే అనేక వ్యాపారాల్లో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ లకు తీసిపోని విధంగా సంపాదిస్తున్నారు. నాగార్జునకి వేలకోట్ల ఆస్తులు ఉన్నాయనేది ఇండస్ట్రీలో టాక్. అయితే నాగార్జునకి ఇంత ఆస్తి తండ్రి ఏఎన్నార్ వారసత్వంగా వచ్చి ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. 

26

అది కొంతవరకు వాస్తవం కావచ్చు కానీ పూర్తిగా కాదు. నాగార్జున సొంతగా ఎన్నో వ్యాపారాలు చేస్తున్నారు. నాగార్జున ఇంత డబ్బు సంపాదించడం వెనుక ఉన్న సీక్రెట్ ని జగపతి బాబు బయటపెట్టారు. నాగార్జున, జగపతి బాబు చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ అట. 

36

తరచుగా ఫ్యామిలి పార్టీలు కూడా జరిగేవి. అప్పుడు కలుసుకునేవాళ్ళం అని జగపతి బాబు అన్నారు. జగపతి బాబు నాగార్జున ఆ పేరుతో కాకుండా మరో షార్ట్ నేమ్ తో పిలుస్తారట. నాగార్జునని అలా పిలిచేది కేవలం తానొక్కడినే అని జగపతి బాబు అన్నారు. అసలు ఇంతకీ నాగ్ ని జగపతి బాబు పిలిచేది 'చౌ' అని అట. 

46

చౌ అంటే చౌదరి. కులం పరంగా అలా పిలుస్తారా అని అడిగితే కులానికి దానికి సంబంధం లేదు. నన్ను కూడా నాగార్జున తిరిగి చౌ అనే అంటాడు. మా పేరులో చౌదరి ఉంది. కాబట్టి షార్ట్ గా అలా పిలుచుకుంటాం అని జగ్గూభాయ్ తెలిపారు. నాగార్జునని రెండురోజులకి ఒకసారి అయినా తలచుకుంటా అని జగపతి బాబు అన్నారు. 

56

ఎందుకంటే నాగార్జునకి ఎలా డబ్బు సంపాదించాలో బాగా తెలుసు. దానిని ఎలా ఖర్చు పెట్టాలో కూడా తెలుసు. నాగార్జున ఏదైనా పని కానీ, వ్యాపారం కానీ మొదలు పెడితే అందులో స్వయంగా ఇన్వాల్వ్ అవుతాడు. వేరే వాళ్ళకి అప్పగించి సైలెంట్ గా ఉండదు. బాగా తెలివైన వాడు. నాగార్జున ఏ విషయాన్ని అయినా ప్రాక్టికల్ గా ఆలోచిస్తూ ఉంటాడు. అదే నాగార్జున సక్సెస్ సీక్రెట్ అని జగపతి బాబు అన్నారు. 

66

జగపతి బాబు ప్రస్తుతం టాలీవుడ్ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బలమైన పాత్రలతో రాణిస్తున్నారు. లెజెండ్, శ్రీమంతుడు, రంగస్థలం, అరవింద సమేత లాంటి చిత్రాలు జగపతి బాబు కెరీర్ కి కొత్త ఊపు తీసుకువచ్చాయి. 

click me!

Recommended Stories