అయ్యో.. పూరి అంత కష్టపడితే.. లైగర్ మూవీనే మరచిపోయిన మైక్ టైసన్, ఆ చిత్రాల కంటే ఘోరంగా రేటింగ్

Published : Aug 28, 2022, 07:26 AM ISTUpdated : Aug 28, 2022, 07:30 AM IST

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన లైగర్ చిత్రం ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ మూవీపై అటు పూరి, ఇటు విజయ్ దేవరకొండ ఇద్దరూ విమర్శలు ఎదుర్కొంటున్నారు.

PREV
16
అయ్యో.. పూరి అంత కష్టపడితే.. లైగర్ మూవీనే మరచిపోయిన మైక్ టైసన్, ఆ చిత్రాల కంటే ఘోరంగా రేటింగ్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన లైగర్ చిత్రం ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ మూవీపై అటు పూరి, ఇటు విజయ్ దేవరకొండ ఇద్దరూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం కావడంతో ఎక్స్ట్రా మైలేజి కోసం ఈ చిత్రంలో లెజెండ్ మైక్ టైసన్ ని నటింప జేశారు. 

26

కానీ మైక్ టైసన్ లాంటి లెజెండ్ ని తీసుకువచ్చి జోకర్ ని చేశారు అంటూ పూరి జగన్నాధ్ పై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. అసలు మైక్ టైసన్ ఈ చిత్రాన్ని ఎందుకు అంగీకరించారో అర్థం కావడం లేదు అని కూడా ట్రోల్ చేశారు. 

36

మైక్ టైసన్ కి సంబంధించిన ఓ యూట్యూబ్ వీడియో వైరల్ గా మారుతోంది. ఈ వీడియోలో మైక్ టైసన్ తన స్నేహితులతో మాట్లాడుతున్నారు. ఈ వీడియో 2021లోనిది. మీరు లైగర్ అనే చిత్రంలో నటించారా అని స్నేహితులు ప్రశ్నించారు. ఏంటి మరోసారి చెప్పు అని అడిగారు. లైగర్ మూవీ ఆయనకి గుర్తు రాలేదు. స్నేహితులు వెంటనే గూగుల్ చేసి చూపించారు. 

46

ఆ తర్వాత వారి మధ్య చర్చ లైగర్ జంతువుపై వెళ్ళింది. లైగర్ తో మీరు పోరాడగలరా అని టైసన్ ని ప్రశ్నించగా.. అది నన్ను 2 సెకండ్లలో చంపేస్తుంది అని బదులిచ్చారు. లైగర్ లో నటించిన సంగతి టైసన్ పూర్తిగా మర్చిపోయినట్లు ఉన్నారు. ఎంతో కష్టపడి ఈ చిత్రం కోసం టైసన్ ని తీసుకువచ్చాం అని పూరి జగన్నాధ్ మూవీ ప్రమోషన్స్ లో తెలిపారు. కానీ టైసన్ పాత్ర సినిమాకి ఏమాత్రం ప్లస్ కాలేదు. 

56

ఇటీవల విడుదలైన బాలీవుడ్ డిజాస్టర్ చిత్రాల కంటే లైగర్ మూవీ ఐఎండిబిలో ఘోరంగా రేటింగ్ నమోదు చేసుకుంది. లైగర్ చిత్రానికి అతి తక్కువగా ఐఎండిబిలో 1.8 రేటింగ్ వచ్చింది. లాల్ సింగ్ చడ్డాకి 5, షంషేరాకి 4.9, దొబారాకి 2. 9 రేటింగ్స్ నమోదయ్యాయి. 

66
Liger-Vijay Deverakonda goes naked & flaunts chiseled body in NEW poster, says 'Film that took my everything'

లైగర్ చిత్రంలో ఎక్కడా పూరి జగన్నాధ్ మార్క్ కనిపించలేదు. హై బడ్జెట్ లో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. హీరోయిన్ గా నటించిన అనన్య పాండే నటనపై కూడా ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. విజయ్, పూరి కాంబోలో మరో చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. పూరి తన డ్రీమ్ ప్రాజెక్టు జనగణమనని విజయ్ తో తెరకెక్కిస్తున్నారు. మరి లైగర్ రిజల్ట్ తో ఈ చిత్రాన్ని కొనసాగిస్తారో లేదో చూడాలి. 

Read more Photos on
click me!

Recommended Stories