రెండో రోజే థియేటర్స్ మొత్తం ఖాళీ.. ఇలాగైతే ఎలా, షాకిస్తున్న నరేష్ కామెంట్స్

First Published Aug 27, 2022, 9:04 PM IST

ఆగష్టు నెలలో టాలీవుడ్ కి మిశ్రమ ఫలితాలు దక్కాయి. సీతా రామం, బింబిసార, కార్తికేయ చిత్రాలు సంచలన విజయాలు నమోదు చేసుకున్నాయి. మాచర్ల నియోజకవర్గం, లైగర్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

ఆగష్టు నెలలో టాలీవుడ్ కి మిశ్రమ ఫలితాలు దక్కాయి. సీతా రామం, బింబిసార, కార్తికేయ చిత్రాలు సంచలన విజయాలు నమోదు చేసుకున్నాయి. మాచర్ల నియోజకవర్గం, లైగర్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. సినిమా యావరేజ్ ఉన్నా సరే ప్రేక్షకులు ఆదరించడం లేదు. అద్భుతంగా ఉంటేనే థియేటర్స్ కి వెళుతున్నారు. 

actor naresh

ఈ పరిస్థితిపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. కొందరు ఓటిటి ఎఫెక్ట్ అంటుంటే.. మరికొందరు టికెట్ ధరలు అని అంటున్నారు. టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ తాజాగా ఈ పరిస్థితిపై ట్విట్టర్ లో షాకింగ్ కామెంట్స్ చేశారు. జనాలు థియేటర్స్ కి ఎందుకు రావడం లేదు ? ఈ ప్రశ్నకి సమాధానం చాలా సింపుల్. మధ్యతరగతి ఫ్యామిలీ థియేటర్ లో సినిమా చూడాలంటే యావరేజ్ గా రూ 2500 ఖర్చు అవుతోంది. 

కేవలం సినిమా టికెట్ ధరలు మాత్రమే కాదు. 20 లేదా రూ 30 ఉండాల్సిన పాప్ కార్న్, పెప్సీని రూ 300కి అమ్ముతున్నారు. ఇది తప్పకుండా మధ్యతరగతికి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో జనాలు మంచి సినిమా మాత్రమే కాదు మంచి ఎక్స్పీరియన్స్ కూడా కోరుకుంటున్నారు. ఆలోచించండి. 

గతంలో యావరేజ్ చిత్రానికి కూడా వారం మొత్తం కలెక్షన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు జనాలు రెండవ రోజు సినిమాకి వెళ్లాలన్నా అది గొప్ప ఫిల్మ్ కావాల్సి వస్తోంది. లేదంటే థియేటర్స్ ఖాళీ అవుతున్నాయి. మనం ప్రతి చిత్రాన్ని గొప్ప చిత్రంగా మార్చగలమా ? సో థియేటర్స్ లో ఖర్చులు తగ్గించడం తప్పనిసరి. మరిన్ని సినిమాలు రావాలన్నా.. ఎక్కువ మంది జనాలు థియేటర్స్ కి వెళ్లాలన్నా ధరలు తగ్గించాల్సిందే అని నరేష్ ట్వీట్ చేశారు. 

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఉన్న ఇలాంటి సమస్యల కారణంగా సినిమా షూటింగ్స్ ఆపేసిన సంగతి తెలిసిందే. నిర్మాతలు ఈ సమస్యలపై చర్చిస్తున్నారు. కొన్ని అంశాలు పరిష్కారం అయ్యాయని సెప్టెంబర్ 1 నుంచి షూటింగ్స్ ప్రారంభం అవుతాయని దిల్ రాజు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. 

పాప్ కార్న్ ధరలు తగ్గించేందుకు మల్టిఫ్లెక్స్ యాజమాన్యాలతో చర్చలు జరిపినట్లు దిల్ రాజు తెలిపారు. నరేష్ లేవనెత్తిన అంశాలతో నెటిజన్లు ఏకీభవిస్తున్నారు. నరేష్ ఇటీవల నాని 'అంటే సుందరానికీ' చిత్రంలో నటించారు. ఆ మూవీ బావుందని ప్రేక్షకులు అన్నప్పటికీ థియేటర్స్ లో విజయం సాధించలేదు. 

click me!