విజయ్ దేవరకొండ సినిమాకు అంత బడ్జెట్టా?, షాక్ అవుతున్న సినీ జనం

First Published | Oct 29, 2024, 8:28 AM IST

విజయ్ దేవరకొండ వరుస ఫ్లాప్‌ల తర్వాత గౌతమ్ తిన్ననూరి మరియు రవికిరణ్ కోల దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నారు. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో 120 కోట్ల భారీ బడ్జెట్ చిత్రం చేయనున్నారు.

Vijay Devarakonda, Vd14, Rahul Sankrityan, Mythri moviemakers


విజయ్‌ దేవరకొండ నటించిన చిత్రాలు లైగర్‌, ఖుషీ, ఫ్యామిలీస్టార్‌ వరసపెట్టి  ప్రేక్షకులను నిరాశపరచడంతో ఇప్పుడు  ఓ సాలిడ్ హిట్  కోసం వెయిట్‌ చేస్తున్నాడు.  ప్రస్తుతం ఈ యువ హీరో జెర్సీ దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో విజయ్‌ పాత్ర, గెటప్‌ వైవిధ్యంగా వుండబోతున్నాయి.

పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. దీంతో పాటు రవికిరణ్‌ కోల దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ రెండింటితో పాటు ట్యాక్సీవాలా దర్శకుడు రాహుల్‌ సంకీర్త్యన్‌ డైరెక్షన్‌లో ఓ చిత్రం ఓకే చేసాడు విజయ్‌. అయితే ఇంత ప్లాఫ్ ల్లోనూ విజయ్ దేవరకొండ సినిమా  బడ్జెట్ లు షాక్ ఇస్తున్నాయి. 120 కోట్ల భారీ బడ్జెట్ విజయ్ దేవరకొండ నెక్ట్స్ ప్రాజెక్టు చేయబోతున్నారనేది సినిమా వర్గాల సమాచారం. ఇంతకీ ఆ ప్రాజెక్టు ఏమిటి

Vijay Devarakonda, Vd14, Rahul Sankrityan, Mythri moviemakers


ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న సినిమా పై భారీ అంచనాలు పెట్టుకుని ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు. విభిన్నమైన కాన్సెప్ట్‌ తో దర్శకుడు రూపొందిస్తున్న ఆ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.

గౌతమ్‌ తిన్ననూరితో చేస్తున్న సినిమా పూర్తి కాగానే విజయ్‌ దేవరకొండ తన తదుపరి సినిమాను రాహుల్ సంకృత్యన్‌ దర్శకత్వంలో చేయబోతున్నారు. ఇప్పటికే వీరి కాంబో మూవీ కన్ఫర్మ్‌ అయిందని, ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌  కూడా పూర్తైనన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకే 120 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. అయితే ఎందుకింత ఖర్చు అవుతోంది అన్నది ప్రశ్న.


Vijay Devarakonda, Vd14, Rahul Sankrityan, Mythri moviemakers


2018 సంవత్సరంలో విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్‌ కాంబినేషన్ లో టాక్సీవాలా సినిమా వచ్చింది. ఆ సినిమా కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. విభిన్న చిత్రాల దర్శకుడిగా రాహుల్‌ కి మంచి పేరు దక్కింది. ఆ సినిమా తర్వాత శ్యామ్ సింగరాయ్ సినిమాతో రాహుల్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

నాని నటించిన ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో రాహుల్ తదుపరి సినిమా ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఆయన విజయ్ దేవరకొండతో తన తదుపరి సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నారు .ఈ చిత్రం వచ్చే సంవత్సరం ప్రారంభంలో షూటింగ్ మొదలు కానుంది.  పీరియడ్ డ్రామాగా రూపొందే ఈా చిత్రంకోసం చాలా సెట్స్ వేస్తున్నారు. విభిన్నమైన గెటప్ లతో కూడిన కాస్ట్యూమ్స్ రెడీ చేస్తున్నారు. 

South Celebrities


 పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన  వీడీ 14 అనౌన్స్ మెంట్  కాన్సెప్ట్ పోస్టర్ ఆసక్తి కలిగిస్తోంది. బీటలు వారిన పంట పొలాల్లో రాతిపై చెక్కిన వీరుడి విగ్రహం ఉంది.

దాని మీద ది లెజెండ్ ఆఫ్ ది కర్స్డ్ ల్యాండ్ అని రాసి ఉంది. ఆయన జీవిత కాలం 1854 నుంచి 1878గా పేర్కొన్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1978 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

Vijay Devarakonda


 'డియర్ కామ్రేడ్', 'ఖుషి' వంటి సక్సెస్ ఫుల్ సినిమాల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్, విజయ్ కలిసి చేస్తున్న మూడో చిత్రమిది. 'టాక్సీవాలా' లాంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాతో మరోసారి కలిసి పనిచేస్తున్నారు. ప్రేక్షకులకు ఒక ఎపిక్ లాంటి ఎక్సీపీరియన్స్ ఇవ్వనుందీ సినిమా.

త్వరలో వీడీ 14 చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు  ఈ చిత్రంలో విజయ్‌ మునుపెన్నడూ కనిపించని గెటప్‌లో వుంటాడని చిత్ర యూనిట్‌ చెబుతోంది. ఈ లుక్‌ చూసిన వారందరూ స్టన్‌ అవుతారని, ఆడియన్స్‌ కూడా ఈ గెటప్‌ ఎంతో ఫ్రెష్ ఫీల్‌ కలిగిస్తుందని అంటున్నారు.  
 

Latest Videos

click me!