Naga Chaitanya: నా భర్తను అలా పిలవొద్దు.. శోభిత కి కోపం వచ్చేసిందిగా..!

Published : Dec 11, 2025, 12:52 PM IST

Naga Chaitanya తో శోభితాకు గతేడాది డిసెంబర్ 4న వివాహం జరిగింది.  ఈ జంట రీసెంట్ గా తమ మొదటి పెళ్లి రోజు జరుపుకున్నారు. ఈ పెళ్లి రోజు సందర్భంగా… తమ పెళ్లికి సంబంధించిన ఓ  స్పెషల్ వీడియోని కూడా ఈ జంట పంచుకున్నారు. ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంది

PREV
14
Naga Chaitanya- Shobitha

సమంత తో విడాకుల తర్వాత అక్కినేని వారసుడు నాగ చైతన్య గతేడాది డిసెంబర్ లో శోభితను వివాహం చేసుకున్నారు. రీసెంట్ గా మొదటి పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకున్న ఈ జోడి.. సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటోంది. వీరిద్దరూ కలిసి చాలా ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నారు. మొదట్లో వీరి జోడిపై విమర్శలు వచ్చినా... ఇప్పుడు మాత్రం వీరి జోడి చూడటానికి చాలా బాగుంది అనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి.

24
అనగనగా ఒక రాజు మూవీ ప్రమోషన్స్...

రీసెంట్ గా యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి... ‘ పొలిశెట్టి మీట్స్ పికిల్ బాల్’ అనే కార్యక్రమం నిర్వహించారు. తన సినిమా ‘అనగనగా ఒక రాజు’ మూవీ ప్రమోషన్స్ కోసం ఈ ప్రోగ్రామ్ నిర్వహించాడు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే.. ఈ కార్యక్రమానికి నాగచైతన్య తన భార్య శోభితతో కలిసి రావడం విశేషం.

34
చై అని పిలవొద్దు...

కాగా.. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ‘అనగనగా ఒక రాజు’ మూవీలోని ‘ భీమవరం బాలుమా.. భాగా బీచ్ పోదమా’ అనే పాటకు స్టెప్స్ వేయమని.. నవీన్.. నాగచైతన్యని పిలిచాడు. అయితే.... ఆ సమయంలో నాగ చైతన్యను.. ‘చై’ అని పిలవడం శోభితకు నచ్చకపోవడం గమనార్హం. నవీన్.. ‘చై’ అని పిలిచిన ప్రతిసారీ... అలా పిలవొద్దని... ‘చై కాదు.. చైతూ’ అని చెప్పారు. చైతూ అని పిలవమని ఆమె నొక్కి నొక్కి మరీ ఎక్కువసార్లు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

44
చై- సామ్ కాదు...

గతంలో సమంత...నాగ చైతన్యను ‘చై’ అని పిలిచేది. వీరిద్దరి జోడిని కలిపి ‘చై, సామ్’ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునేవాళ్లు. వాళ్లిద్దరూ విడిపోయినా కూడా.. ఇంకా అలానే పిలవడం శోభితకు నచ్చినట్లు లేదు. అందుకే... చైతూ అని పిలవమని చెప్పిందనే కామెంట్స్ వినపడుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories