యువరాణిలా మెరిసిపోతున్న ‘స్కంద’ బ్యూటీ.. లెహంగా వోణీలో కట్టిపడేస్తున్నబాలీవుడ్ అందం..

First Published | Sep 28, 2023, 3:03 PM IST

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా సౌత్ లో వరుస చిత్రాలతో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. తన గ్లామర్, డాన్స్ తో రచ్చ చేస్తోంది. తాజాగా ‘స్కంద’తో థియేటర్లోకి వచ్చింది. 

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా (Urvashi Rautela)  సౌత్ లో ముఖ్యంగా తెలుగులో వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’లో మెగాస్టార్ తో కలిసి గ్లామర్ స్టెప్పులేసిన ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులను ఫిదా చేసింది. అప్పటి నుంచి వరుసగా ఐటెం నెంబర్స్ తో అదరగొడుతోంది. 
 

‘వాల్తేరు వీరయ్య’తో పాటు అఖిల్ ‘ఏజెంట్’, పవన్ కళ్యాణ్ ‘బ్రో’ మూవీలోనూ స్పెషల్ సాంగ్స్ లో నటించి తెలుగు ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. గ్లామర్ స్టెప్పులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. దీంతో సౌత్ లో ఈ ముద్దుగుమ్మకు మంచి డిమాండ్ పెరిగింది. 
 


ఇక తాజాగా ఊర్వశీ రౌటేలా ‘స్కంద’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో రామ్ పోతినేని - శ్రీలీలా జంటగా నటించిన విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
 

ఈ చిత్రంలో రామ్ పోతినేని సరసన ‘కల్ట్ మామా’ సాంగ్ లో నటించి రచ్చ చేసింది. ఇప్పటికే ఈ సాంగ్ కు యూట్యూబ్ లో బ్రహ్మాండమైన రెస్పాన్స్ దక్కుతోంది. ఇక ఊర్వశీ పలు మ్యూజిక్ వీడియోల్లోనూ నటిస్తోంది. తాజాగా Hum Toh Deewane అనే ప్రైవేట్ ఆల్బల్ లో నటించింది. సెప్టెంబర్ 1న విడుదలైంది.
 

తను నటించిన మ్యూజిక్ వీడియో విడుదలైన సందర్భంగా ప్రమోట్ చేస్తోంది. ఈ సందర్భంగా సంప్రదాయ లుక్ లో ఫొటోషూట్ చేసింది. ఎప్పుడూ నెట్టింట టైట్ ఫిట్ లో దర్శనమిచ్చే ఈ ముద్దుగుమ్మ తాజాగా యువరాణిలో మెరిసింది. లెహంగా చోళీలో మెరిసిపోయింది. తన అందంతో మంత్రముగ్ధులను చేసింది.
 

తాజాగా ఊర్వశీ పంచుకున్న ఫొటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇక ఊర్వశీ హిందీలో ‘దిల్ హై గ్రే’, ‘తెలుగులో ‘బ్లాక్ రోజ్’ చిత్రాల్లో నటిస్తోంది. ఇటు స్పెషల్ అపియరెన్స్ తో నూ అదరగొడుతోంది. సమయం ఉన్నప్పుడు ఇలా సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తోంది.

Latest Videos

click me!