Bigg Boss Telugu 7: బిగ్ బాస్ హౌస్ లో 14 వారాల.. గట్టిగా వసూలు చేసిన శోభా శెట్టి..

Published : Dec 13, 2023, 07:11 AM ISTUpdated : Dec 13, 2023, 07:12 AM IST

బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకువచ్చింది. ఇంకో వారంలో రిజల్ట్ తెలియబోతోంది. ఈక్రమంలో చివరి వరకూ ఉంటుంది అనుకున్న శోభా శెట్టి..లాస్ట్ వీక్ ఎలిమినేట్అయ్యి బయటకువచ్చేసింది. చాలా నెగెటివిటీ ఉన్న ఈ బ్యూటీ.. 14 వారాలు హౌస్ లో ఉంది. మరి అందుకోసం ఆమె అందుకున్న రెమ్యూనరేషన్ ఎంత..? 

PREV
15
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ హౌస్ లో 14 వారాల.. గట్టిగా వసూలు చేసిన శోభా శెట్టి..

బిగ్ బాస్ సీజన్ 7 లో బాగా నెగెటీవ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకుంది శోభా శెట్టి..  8 వ కంటెస్టెంట్ గా ఆమె  హౌస్ లోకి  ఎంట్రీ ఇచ్చింది. ముందు కాస్త పాజిటీవు గానే కనిపించినా..ఆతరువాత చిన్నగా మోనితలోని డిఫరెంట్ శేడ్స్ ఆడియన్స్ గమణించారు.  కార్తీక దీపం సీరియల్ లో మోనిత పాత్రలో బాగా ఫేమస్అయిన  శోభా శెట్టి... హౌస్ లో కూడా మోనితనే గుర్తు చేసిందిపలు సందర్బాలలో. 
 

25

అయితె ఆమె గేమ్స్ లో బెస్ట్ ఇచ్చింది.  మొదటి నుండి ఆమె టాప్ కంటెస్టెంట్ గా పేరు సంపాదించుకుంది. ప్రతి గేమ్ లో శివంగిలా దూకింది. కాని కొన్ని సార్లు తోటి కంటెస్టెంట్స్ తో ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్ళిపోయి గొడవలు పెట్టుకునేది. శోభా శెట్టి చేసినకొన్ని పనుల వల్ల ఆమె కన్నింగ్ అని చాలా మందికి అర్ధం అయ్యింది. అంతే కాదు ఈమెపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిసేది. 

35
serial actress Shobha shetty

అసలు శోభా శెట్టి ఇన్నిరోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉంటుంది అని ఎవరూ అనుకోలేదు. ఆమెపై ఉన్న నెగిటివిటీ వల్ల ఈమె చాలా రోజుల క్రితమే ఎలిమినేటి అయివెళ్లిపోతుంది అనుకున్నారు. కాని ఎందుకో బిగ్ బాస్ ఆమెను ప్రతీ సారి కాపాడుకుంటూ వచ్చాడు. ఒక రకంగాచెప్పాలంటే.. సీరియల్ బ్యాచ్ మద్యగొడవలకు పెట్టింది శోభనే అన్న అభిప్రాయం ఉంది కంటెస్టెంట్లలో. 

45

ఇక ఎట్టకేలకు ఆమె బయటకు వచ్చింది. ఫైనల్స్ కు వెళ్తుంది అని అనుకుంటే.. వారం ముందే ఆమెబయటకు రావలసి వచ్చింది. ఏది ఏమైనా.. 14 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న శోభా శెట్టి.. రెమ్యూనరేషన్ మాత్రం గట్టిగానే వసూలు చేసిందట. ఆమె ఎపిసోడ్ కు దాదాపు 2.5 లక్షలు వసూలు చేసిందట. 

55

ఇకఎపిసోడ్ కు 2.5 లక్షలు అంటే.. దాదాపు హౌస్ లో శివాజి తరువాత ఆమెకె ఎక్కు రెమ్యూనరేషన్ ఉంది అనుకోవచ్చు. మరి ఈ వార్తల్లో నిజం ఎంత తెలియదు కాని..ఆమె రెమ్యునరేషన్ పై వార్తలు మాత్రం హైలెట్ అవుతూ ఉన్నాయి. ఇక ఈ వారం తరువాత ఫైనల్స్ జరగబోతున్నాయి. హౌస్ లో పైనల్ కు చేరిన వారు 6 ఉండగా.. అందులో శివాజీ, ప్రశాంత్, అర్జున్ పేర్లు  విన్నర్ లిస్ట్ లో మారు మోగుతున్నాయి. 

Read more Photos on
click me!

Recommended Stories