బిగ్ బాస్ హౌస్ నుంచి శోభా శెట్టి అవుట్, కుప్పకూలి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ.. ఫైనలిస్టులు ఎవరెవరంటే

First Published | Dec 10, 2023, 10:42 PM IST

బిగ్ బాస్ సీజన్ 7లో ఇక మిగిలింది తుది దశ మాత్రమే. ఫైనల్ స్టేజ్ లోకి గేమ్ ఎంటర్ అయిపోయింది. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో ఫైనలిస్టులు ఎవరో తెలిసిపోయింది. టైటిల్ రేసులో నిలబడేది వీరే అంటూ నాగార్జున రివీల్ చేశారు.

బిగ్ బాస్ సీజన్ 7లో ఇక మిగిలింది తుది దశ మాత్రమే. ఫైనల్ స్టేజ్ లోకి గేమ్ ఎంటర్ అయిపోయింది. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో ఫైనలిస్టులు ఎవరో తెలిసిపోయింది. టైటిల్ రేసులో నిలబడేది వీరే అంటూ నాగార్జున రివీల్ చేశారు. ఆదివారం ఎపిసోడ్ లో నాగార్జున ఎంట్రీ ఇవ్వగానే చిన్న షాక్ ఇచ్చారు. మొత్తంగా బిగ్ బాస్ సీజన్ 7 ఫైనలిస్టులుగా నిలిచింది అర్జున్, ప్రియాంక, యావర్, అమర్ దీప్, ప్రశాంత్, శివాజీ. ఇక శోభా శెట్టి ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటకి వెళ్ళింది. 

ఆల్రెడీ అర్జున్ ఫైనల్ వీక్ కి చేరిపోయిన మొదటి కంటెస్టెంట్ గా నిలిచారు. నాగార్జున నేడు రెండవ కంటెస్టెంట్ ని రివీల్ చేశారు. ప్రియాంక జైన్ రెండవ ఫైనలిస్ట్ గా అర్హత సాధించినట్లు నాగార్జున ప్రకటించారు. దీనితో ఆమె ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. మధ్యలో ఫన్నీ గేమ్స్ ఆడిస్తూ నాగార్జున ఒక్కో ఫైనలిస్టుని రివీల్ చేస్తూ వచ్చారు. 


ప్రియాంక తర్వాత యావర్, అమర్ దీప్ ఫైనలిస్టులుగా నిలిచారు. ఇక నాగార్జున ఒక్కో కంటెస్టెంట్ ని పిలిచి హౌస్ లో తమకి బాధకలిగించిన వారం ఏంటి అని ప్రశ్నించారు. అర్జున్ 13 అని , ప్రియాంక 9 అని, యావర్ మొదటి వారం అని ఇలా ఎవరికి వారు చెప్పుకొచ్చారు. 

ఆ తర్వాత నాగార్జున సోషల్ మీడియాలో ఇంటి సభ్యుల గురించి పేలుతున్న మీమ్స్ ప్లే చేశారు. మీమ్స్ చూసుకుని కంటెస్టెంట్స్ అంతా కడుపుబ్బా నవ్వుకున్నారు. అనంతరం బిగ్ బాస్ వేదికపైకి ఆస్కార్ విజేత లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అతిథిగా హాజరయ్యారు. నాగార్జున నా సామిరంగ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. కీరవాణి ఈ చిత్రంలోని ఫస్ట్ సాంగ్ ని బిగ్ బాస్ వేదికపై లాంచ్ చేశారు. ఈ ఎక్స్పీరియన్స్ తనకి కొత్తగా ఉందని అన్నారు. 

నాగార్జున కీరవాణికి ఒక్కో కంటెస్టెంట్ ని పరిచయం చేశారు. మరో ఫైనలిస్ట్ ని రివీల్ చేసే భాద్యత నాగార్జున కీరవాణి గారికి ఇచ్చారు. కీరవాణి గారి చేతుల మీదుగా రివీల్ అయిన మరో ఫైనలిస్ట్ పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్ తనకి ఓట్ వేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. 

ఇక మిగిలింది శోభా శెట్టి, శివాజీ మాత్రమే. వీళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు మరొకరు ఫైనలిస్ట్ గా నిలుస్తారు. వీళ్లిద్దరికీ నాగార్జున ఉత్కంఠతో కూడుకున్న ఒక గేమ్ పెట్టారు. ముందుగా ఎవరి టికెట్ పూర్తయితే వాళ్ళు ఫైనల్ కి చేరుతారు. మరొకరు ఎలిమినేట్. నాగార్జున చెప్పిన నంబర్స్ ప్రకారం శివాజీ టికెట్ ముందుగా పూర్తి అవుతుంది. దీనితో శివాజీ ఫైనలిస్ట్ గా నిలవగా.. శోభా శెట్టి ఎలిమినేట్ అయింది. 

శోభా ఎలిమినేట్ కావడంతో ప్రియాంక కన్నీరు మున్నీరుగా ఏడ్చేసింది. ఇక శోభా శెట్టి వేదికపైకి వెళ్లి తన జర్నీ చూసుకుంది. దీనితో శోభా శెట్టి భావోద్వేగాన్ని దాచుకోలేకపోయింది. కన్నీరు మున్నీరుగా ఏడ్చేస్తూ వేదికపైనే కుప్పకూలినట్లు కూర్చుండిపోయింది. దీనితో నాగార్జున ఆమెని ఓదార్చారు. 

Latest Videos

click me!