పెళ్లి అయ్యాక ఫస్ట్ క్రిస్మస్‌.. ఆపుకోలేక ముందే సెలబ్రేషన్‌ స్టార్ట్ చేసిన లావణ్య త్రిపాఠి..

Published : Dec 10, 2023, 08:32 PM ISTUpdated : Dec 10, 2023, 08:42 PM IST

మెగా కొత్త కోడలు లావణ్య త్రిపాఠి ప్రస్తుతం ఓ వైపు వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. ఓ రకంగా ఆమె హనీమూన్‌ ట్రిప్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. విదేశాల్లో సందడి చేస్తుంది. 

PREV
16
పెళ్లి అయ్యాక ఫస్ట్ క్రిస్మస్‌.. ఆపుకోలేక ముందే సెలబ్రేషన్‌ స్టార్ట్ చేసిన లావణ్య త్రిపాఠి..

లావణ్య త్రిపాఠి గత నెలలో పెళ్లి చేసుకుంది. మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఇద్దరు వెకేషన్‌లో ఉన్నారు. హనీమూన్‌ని ఎంజాయ్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. 
 

26

ఇదిలా ఉంటే తాజాగా లావణ్య త్రిపాఠి తన వెకేషన్‌ ఫోటోలను పంచుకుంది. అయితే ఇందులో ఆమె క్రిస్మస్‌ ట్రీ వద్ద కనిపించడం విశేషం. చూడబోతుంటే లావణ్య ముందే క్రిస్మస్ సెలబ్రేషన్‌ స్టార్ట్ చేసినట్టు కనిపిస్తుంది. 
 

36

అసలే పెళ్లైన ఆనందంలో ఉంది. పెళ్లైక వచ్చిన మొదటి క్రిస్మస్‌ ఫెస్టివల్‌ కావడంతో దాన్ని మరింత ప్రత్యేకంగా భావిస్తుంది. దీంతో ముందుగానే సెలబ్రేషన్‌ స్టార్ట్ చేసింది లావణ్య. తాజాగా ఆమె క్రిస్మస్‌ ట్రీ వద్ద సందడి చేసింది. 
 

46

క్రిస్మస్‌ ట్రీని డెకరేట్‌ చేస్తూ కనిపించింది. క్యూట్‌గా పోజులిచ్చింది. తలపై రెడ్‌ హ్యాట్‌ ధరించింది. ముఖ్యంలో ఆనందం కనిపిస్తుంది. ఆనందమంతా తనలోనే ఉందనేలా ఆమె పోజులివ్వడం విశేషం. 

56

ఇక లావణ్య త్రిపాఠి ఆల్మోస్ట్ సినిమాలకు గుడ్‌ బై చెప్పిన పరిస్థితి. ఆమె చివరగా గతేడాది `హ్యాపీ బర్త్ డే` అనే సినిమాలో నటించింది. తనే మెయిన్‌ లీడ్‌. కానీ సినిమా ఆడలేదు. ఆ తర్వాత తమిళంలో ఓ సినిమా చేసింది. అది విడుదలకు సిద్ధమయ్యింది.
 

66

 కొత్తగా రెండు సినిమాలకు సైన్‌ చేసినట్టు ఆ మధ్య వార్తలొచ్చాయి. కానీ పెళ్లైంది, మెగా కోడలుగా వెళ్లింది. బోలెడన్ని బాధ్యతలు ఆమెపై ఉంటాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్‌గా సినిమాలు చేయగలుగుతుందా? మెగా ఫ్యామిలీ ఒప్పుకుంటుందా? అనేది పెద్ద సస్పెన్స్. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories