విజయ్‌ దేవరకొండతో డేట్‌కి వెళ్తానన్నా సారా అలీ ఖాన్‌.. షాక్ లో జాన్వీకపూర్‌.. ముద్దుగుమ్మల మధ్య పోరు

Published : Jul 12, 2022, 05:15 PM IST

రౌడీ బాయ్‌ విజయ్ దేవరకొండకి ఉన్న క్రేజ్‌ ఫాలోయింగ్‌ ఎలాంటిదో తెలిసిందే. అమ్మాయిలు పడి చస్తారు. తాజాగా స్టార్‌ కిడ్స్, యంగ్‌ హీరోయిన్లు విజయ్ కోసం పోటీ పడుతుండటం విశేషం. 

PREV
19
విజయ్‌ దేవరకొండతో డేట్‌కి వెళ్తానన్నా సారా అలీ ఖాన్‌.. షాక్ లో జాన్వీకపూర్‌.. ముద్దుగుమ్మల మధ్య పోరు

విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda)కి `అర్జున్‌రెడ్డి`, `గీతగోవిందం`తో విపరీతమైన ఫాలోయింగ్‌ ఏర్పడింది. అమ్మాయిలు ఆయనపై క్రష్‌ పెంచుకున్నారు. తాజాగా చూస్తుంటే అమ్మాయిలే కాదు, స్టార్‌ హీరోయిన్లు కూడా క్రష్‌ని పెంచుకోవడం విశేషం. బాలీవుడ్‌ హీరోయిన్లు సారా అలీ ఖాన్‌(Sara Ali Khan), జాన్వీ కపూర్‌(Janhvi Kapoor) విజయ్‌ దేవరకొండపై తమ ఇంట్రెస్ట్ ని తెలిపారు. డేటింగ్‌ చేయాలనుందని వెల్లడించారు. 

29

బాలీవుడ్‌లో సామాజిక మాధ్యమాల్లో అత్యంత క్రేజ్‌ ఉన్న హీరోయిన్లు జాన్వీ కపూర్‌, సైఫ్‌ అలీ ఖాన్. ఒకరు అతిలోక సుందరి శ్రీదేవి తనయ కాగా, మరొకరు సైఫ్‌ అలీ ఖాన్ ముద్దులు కూతురు. ఈ యంగ్‌ సెన్సేషన్‌ సోషల్‌ మీడియాలోకి అడుగుపెట్టారంటే షేక్‌ అయిపోవాల్సిందే. వారి గ్లామర్‌ ఫోటోలు ఇంటర్నెట్‌ని ఊపేస్తుంటాయి. లక్షలాది నెటిజన్లు వారి ఫోటోల కోసం ఎగబడుతుంటారు. 
 

39

ఇన్‌స్టాగ్రామ్‌లో ఇరవై మిలియన్స్ కిపైగా ఫాలోవర్స్ ఉన్న ఈ యంగ్‌ సెన్సేషన్స్ తాజాగా బాలీవుడ్ మేకర్ కరణ్‌ జోహార్‌(Karan Johar) ఫేమస్‌ టాక్‌ షో `కాఫీ విత్‌ కరణ్‌`)Koffee with Karan)లో పాల్గొన్నారు. వీరిద్దరు కలిసి పాల్గొన్నగా, తాజాగా వీరి ఎపిసోడ్‌ ప్రోమో విడుదలైంది. ఇందులో వీరిద్దరు ఒక షాకింగ్‌ విషయాన్ని వెల్లడించారు. ఇద్దరూ విజయ్‌ దేవరకొండపై తమ క్రష్‌ని వెల్లడించారు. 
 

49

ఇందులో కరణ్‌ జోహార్‌ సారా అలీ ఖాన్‌ స్టయిల్‌లో `నమస్తే దర్శకోన్‌` అని జాన్వీ, సారా అలీ ఖాన్ లను ఆహ్వానించారు. సారా అలీ ఖాన్‌ తన ఇన్ స్టాగ్రామ్‌లో అభిమానులను దర్శకన్‌ అని పిలుస్తుంటుంది. అదే పదంతో కరణ్‌ వారిని ఆహ్వానించడం విశేషం. 

59

మొదటగా ఇద్దరి మధ్య స్నేహం ఎక్కడ స్టార్ట్ అయ్యింది? ఎలా స్టార్ట్ అయ్యిందని ప్రశ్నించారు కరణ్‌. దీనికి స్పందించిన జాన్వీ కపూర్.. `మీరు అసభ్యకరమైన కోణాలను బయటకు తీస్తారని చాలా మంది చెప్పారు. కానీ ఇది అలా లేదనే కోణంలో జాన్వీ సమాధానం చెప్పింది. 

69

నెక్ట్స్ ఎవరితో డేటింగ్‌ చేయాలని అనుకుంటున్నావ్‌ అని సారా అలీ ఖాన్ ని ప్రశ్నించాడు కరణ్‌. దీనికి ఆమె వెంటనే సమాధానం చెప్పలేకపోయింది. కొంత గ్యాప్‌ తర్వాత సారా అలీ ఖాన్.. విజయ్‌ దేవరకొండ పేరు చెప్పింది. ఇది విన్న జాన్వీ కపూర్‌ షాక్‌కి గురయ్యింది. అది గమనించిన సారా ఓహ్‌.. `నువ్వు కూడా అతన్ని ఇష్టపడుతున్నావా` అని ప్రశ్నించడం హైలైట్‌గా నిలిచింది. 

79

జాన్వీ కపూర్‌.. విజయ్ దేవరకొండపై తన క్రష్‌ని చాలా రోజుల క్రితమే వెల్లడించింది. ఆయనతో కలిసి `లైగర్‌`లో కలిసి నటించే అవకాశం కూడా వచ్చింది. కానీ డేట్స్ కారణంగా వదులుకుంది. నెక్ట్స్ సినిమాలోనూ చేయబోతుందన్నారు. కానీ సెట్ కాలేదు. మరోవైపు ఎలాంటి సంబంధం లేని సారా అలీ ఖాన్.. విజయ్‌ దేవరకొండపై ప్రేమని వ్యక్తం చేయడం విశేషం. వీరి ఎపిసోడ్‌ ఈ నెల(జులై) 14న డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.
 

89

ఇలా ఓ రకంగా జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్‌ ఇద్దరూ విజయ్‌ దేవరకొండ కోసం పోటీ పడటం ఆద్యంతం ఆసక్తికరంగా మారడంతోపాటు ఇది వైరల్‌ అవుతుంది. ప్రోమో ట్రెండ్‌ అవుతుంది. ఈ ఇద్దరుస్టార్‌ కిడ్స్ బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. 
 

99

విజయ్‌ దేవరకొండ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ `లైగర్‌` చిత్రంలో నటించారు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఛార్మి, కరణ్‌ జోహార్‌ నిర్మించారు. ఆగస్ట్ 25న ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియన్‌ మూవీగా విడుదల చేయబోతున్నారు. ఇందులో అనన్య పాండే కథానాయిక. ఈ ఇద్దరు కూడా `కాఫీ విత్‌ కరణ్‌` షోలో పాల్గొన్నారు. నెక్ట్స్ వీరిది ప్రసారం కానుంది.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories