గత ఏడాది షైన్ టామ్ మలయాళంలో 'వివేకానందన్ వైరల్' అనే చిత్రంలో నటించాడు. నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ కమల్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. గత ఏడాది థియేటర్స్ లోకి వచ్చిన ఈ మూవీ తాజాగా ఓటిటిలో రిలీజ్ అయింది. ఆహా ఓటిటిలో ఈ చిత్రం తెలుగులో అందుబాటులోకి వచ్చింది. రొమాంటిక్ థ్రిల్లర్ కావడంతో ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్లు నటించారు. శ్వాసిక, గ్రేస్ ఆంటోని, మెరీనా మైఖేల్, రమ్య సురేష్, మంజు పిళ్ళై హీరోయిన్లుగా నటించారు.