Thandel Movie Review: `తండేల్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌

Published : Feb 07, 2025, 11:47 AM IST

Thandel Movie Review: నాగచైతన్య, సాయిపల్లవి `లవ్‌ స్టోరీ` తర్వాత మరోసారి `తండేల్‌` చిత్రంలో నటించారు. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ మూవీ నేడు శుక్రవారం విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.   

PREV
16
Thandel Movie Review: `తండేల్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌
Thandel Movie Review

Thandel Movie Review: `లవ్‌ స్టోరీ`తో మ్యాజిక్‌ చేసింది నాగచైతన్య, సాయిపల్లవి జోడీ. ఇప్పుడు మరోసారి కలిసి `తండేల్‌` మూవీలో నటించారు. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీవాసు నిర్మించారు. ఈ మూవీ నేడు శుక్రవారం(ఫిబ్రవరి 7)న విడుదలైంది. మత్స్యకారుల జీవితం ఆధారంగా యదార్థ కథతో రూపొందిన ఈ మూవీ ఎలా ఉంది? మరోసారి నాగచైతన్య, సాయిపల్లవి జోడీ మ్యాజిక్‌ చేసిందా? `తండేల్‌` ఆడియెన్స్ ని అలరించడం సక్సెస్‌ అయ్యిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

26
Thandel Movie Review

కథః 
శ్రీకాకుళంలో మత్స్యకారులు రెగ్యూలర్‌గా గుజరాత్‌కి సముద్రంలో చేపల కోసం వేటకు వెళ్తుంటారు. 9 నెలలు వేటకు వెళ్లి, మూడు నెలలు ఇంటి వద్ద ఉంటారు. ఆ తొమ్మిది నెలలు పడ్డ కష్టంతో ఊర్లో వారి కుటుంబాలు జీవనం సాగిస్తుంటాయి. రాజు (నాగచైతన్య) కూడా తన వాళ్లతో కలిసి ప్రతి సారి వేటకు వెళ్తుంటారు. తొమ్మిది నెలల తర్వాత వచ్చే రాజు కోసం సత్య(సాయి పల్లవి) వెయిట్‌ చేస్తుంటుంది.

రాజు, సత్య చిన్నప్పట్నుంచి కలిసి పెరుగుతారు. ప్రేమించుకుంటారు. ఒకరికోసం ఒకరు జీవిస్తుంటారు. అయితే వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడు చనిపోవడంతో సత్యలో భయం స్టార్ట్ అవుతుంది. ఇలాంటి పరిస్థితి రాజు విషయంలో జరిగితే ఎలా అని ఊహించుకుని బాధపడుతుంది. బాగా భయపడుతుంది. అయితే తొమ్మిది నెలల తర్వాత వేటకు వెళ్లి వచ్చిన రాజుకి ఈ విషయం చెబుతుంది.

ఈ సారి వెళ్లొద్దంటూ రాజు వద్ద ప్రమీస్‌ కూడా తీసుకుంటుంది. కానీ తన టీమ్‌కి రాజునే తండేల్‌(నాయకుడు) తాను వెళ్లకుండా ఉండలేదు. సత్యకి చెప్పకుండా ఎప్పటిలాగే వెళ్లిపోతాడు. ఇది చూసి రైల్వే స్టేషన్‌కి వెళ్తుంది సత్య. అక్కడ నేను ముఖ్యమా? తండేల్‌ ముఖ్యమా? తేల్చుకో అంటే తండేల్‌ ముఖ్యమని వెళ్ళిపోతాడు రాజు. దీంతో గుండె పగిలిపోయిన సత్య తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి?

వేటకు వెళ్లిన రాజు టీమ్‌ పాకిస్తాన్‌ కోస్ట్ గార్డ్స్ కి ఎలా దొరికిపోయారు? అక్కడ ఏం జరిగింది? పాకిస్తాన్‌ నుంచి బయటపడేందుకు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? రాజుని కాదని వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధమైన సత్య మ్యారేజ్‌ చేసుకుందా? అటు రాజు టీమ్‌ పాకిస్తాన్‌ నుంచి విడుదల కావడానికి సంబంధించి, ఇటు సత్య పెళ్లికి సంబంధించి ఎలాంటి ఉత్కంఠభరిత సన్నివేశాలు చోటు చేసుకున్నాయనేది మిగిలిన కథ. 

36
Thandel Movie Review

విశ్లేషణః 
`తండేల్‌` రియల్‌ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందించిన చిత్రం. శ్రీకాకుళంలోని కోస్టల్‌ విలేజెస్‌లో ఉన్న చాలా మంది ఇలానే గుజరాత్‌ సేట్‌ ల వద్ద పని కోసం వెళ్తారు. అలా వెళ్లిన 22 మంది పాకిస్తాన్‌ పోలీసులకు దొరికిపోవడంతో వాళ్లు బయటపడేందుకు పడే బాధలు, విడుదల విషయంలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల సమాహారంగా ఈ మూవీని రూపొందించారు.
సినిమా మెయిన్‌గా రాజు, సత్యల ప్రేమ కథ చుట్టూ తిరుగుతుంది. లవ్‌ స్టోరీనే హైలైట్‌గా చూపించారు. నాగచైతన్య, సాయిపల్లవి మధ్య లవ్‌ ఎపిసోడ్‌ని బిల్డ్ చేయడానికే ఫస్టాఫ్‌ అంతా తీసుకున్నారు. అయితే దాన్ని బాగా లాగినట్టుగా ఉంటుంది. లవ్‌ లో ఫీల్‌ ఉంటుంది. కానీ అదే కొనసాగడంతో బోర్‌ తెప్పిస్తుంది. ఫస్టాఫ్‌ మొత్తం స్లోగా రన్‌ అవుతుంది.

అదే సమయంలో కేవలం లవ్‌ ట్రాక్‌కే ప్రయారిటీ ఇవ్వడంతో ఎంటర్‌టైన్‌మెంట్‌ మిస్‌ అవుతుంది. లవ్‌ డ్రామా కూడా ఓవర్‌ గా అనిపిస్తుంది. అదేసమయంలో సినిమా ఎమోషనల్‌గా హంట్‌ చేస్తుంటుంది. లవ్‌ లోని ఎమోషనే సినిమాకి పెద్ద అసెట్‌. ఇక సెకండాఫ్‌లో కూడా ఇదే సేమ్‌ రిపీట్‌ అవుతుంది.

సినిమా అంతా ఎమోషనల్‌ సైడ్‌ తీసుకుంటుంది. రాజు టీమ్‌ పాకిస్తాన్‌  పోలీసులకు దొరికిపోవడంతో కొంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అక్కడ దేశ భక్తి ఎలిమెంట్లని జోడించారు. అవి కాస్త రెగ్యూలర్‌గా అనిపిస్తాయి. 
 

46
Thandel Movie Review

పాకిస్తాన్‌ జైల్లో సీన్లు కూడా అంతగా కనెక్ట్ అయ్యేలా లేవు. ఆ ఎపిసోడ్‌ మొత్తం సినిమా రెండున్నర గంటల కోసం లాగినట్టుగానే ఉంటుంది. పాకిస్తాన్‌, దేశ భక్తి ఎపిసోడ్‌ కొంచెం ఓవర్‌గా అనిపిస్తుంది. అయితే క్లైమాక్స్ సినిమాకి ప్రధాన బలం. అదే సినిమాని నిలబెట్టిందని చెప్పొచ్చు. ఆయా ఎపిసోడ్‌లో అటు సాయిపల్లవి, ఇటు నాగచైతన్య ఇద్దరూ రెచ్చిపోయారు. క్లైమాక్స్ ని బలంగా రాసుకున్నారు.

అంతే బలంగా తెరపై ఆవిష్కరించారు. అందులో ఎమోషనల్‌ సీన్లు కూడా ఆద్యంతం హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి. గుండెల్ని పిండేసేలా ఉంటాయి. రాజు కోసం సత్య వెయిట్‌ చేయడం, ఆయన్ని వదులుకోలేక, తను పడే బాధ హృదయాన్ని పిండేస్తుంది. సినిమాని మొత్తం ఎమోషనల్‌ రోలర్‌ కోస్టర్‌గా తీశారు. కాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌ జోడిస్తే బాగుంటుంది.

అదే సమయంలో చాలా లాజిక్స్ మిస్‌ అయ్యాయి. కొన్ని సీన్లు మూవీ స్థాయిలో లేవు. కథ, కథనంపై మరింత దృష్టిసారించాల్సింది. కానీ ఓవర్‌లాగా అయితే సినిమా మంచి ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీతోపాటు ఎమోషనల్‌ రోలర్‌ కోస్టర్‌ అని చెప్పొచ్చు. సాయిపల్లవి తన భుజాలపై సినిమాని మొసిందని చెప్పొచ్చు. అదే సమయంలో నాగచైతన్య కూడా మెస్మరేజ్‌ చేశారు. ఇద్దరు సినిమాలో మ్యాజిక్‌ చేశారు.
 

56
Thandel Movie Review

నటీనటులుః 
రాజు పాత్రలో నాగచైతన్య ఇరగదీశారు. ఇప్పటి వరకు నటించిన సినిమాలు ఓ ఎత్తైతే, `తండేల్‌`లో ఆయన నటన మరో ఎత్తు అని చెప్పాలి. చాలా చోట్ల సాయి పల్లవికి చాలా కాంపిటీషన్‌ ఇచ్చాడు. డామినేట్‌ కూడా చేశాడు. రాజు పాత్ర కోసం చాలా కష్టపడ్డాడు. ఆయన పడ్డ కష్టం ప్రతి ఫ్రేములోనూ తెలుస్తుంది. నటుడిగా చైతూని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లే సినిమా ఇది. డాన్సులు కూడా అదరగొట్టాడు.

ఇక సత్య పాత్రలో సాయిపల్లవి ఎప్పటిలాగే అదరగొట్టింది. సాయిపల్లవి సినిమా చేస్తుందంటేనే అందులో ఏదో ఉంటుంది. తన పాత్రకి ప్రయారిటీ ఉంటుంది. ఇందులోనూ డీ గ్లామర్‌ లుక్‌లో వాహ్‌ అనిపించింది. నటన పరంగా మెస్మరైజ్‌ చేసింది. సెకండాఫ్‌లో ఆమె నటన పీక్‌ అని చెప్పాలి. సినిమాని మొత్తం ఆమెనే నడిపిస్తుంది.

డాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నెమలి నాట్యమాడిందా అనేట్టుగానే ఉంటుంది. మొత్తంగా రాజుగా నాగచైతన్య, సత్య గా సాయిపల్లవి దుమ్ములేపారు. ఈ మూవీకి వీరి నటనే బిగ్‌ అసెట్‌. వీరినటనతో సినిమాలోని చాలా లూప్స్ ని కవర్‌ చేశారు. మిగిలిన ఆర్టిస్ట్ లు ఉన్నంతలో ఆకట్టుకున్నారు.సహజంగా చేశారు.
 

66
Thandel Movie Review

టెక్నీషియన్లుః 
సినిమా టెక్నీకల్‌గా బాగుంది. సినిమా విజువల్‌గా బాగుంది. రిచ్‌గా ఉంది. శామ్‌దత్‌ కెమెరా వర్క్ సినిమాకి బాగా ప్లస్‌ అయ్యాయి. సముద్రపు సీన్లు, బీచ్‌ సీన్లు బాగున్నాయి. ఎడిటింగ్‌ పరంగా ఇంకా బాగా చేయాల్సింది. షార్ప్‌గా కట్‌ చేయాల్సింది. మ్యూజిక్‌ సినిమాకి పెద్ద అసెట్‌. హీరోహీరోయిన్ల నటన తర్వాత మ్యూజిక్‌ హైలైట్‌గా నిలుస్తుంది. పాటలు బాగున్నాయి.

బీజీఎం కూడా ఆకట్టుకునేలా ఉంది. చాలా సీన్లని నెలబెట్టింది కూడా. ఇక దర్శకుడు చందూ మొండేటి రచయితగా, దర్శకుడుగా వంద శాతంసక్సెస్‌ కాలేదు. కానీ ఆర్టిస్ట్ ల నుంచి నటనను రాబట్టుకోవడంలో సక్సెస్‌ అయ్యారు. కథనాన్ని మరింత గ్రిప్పింగ్‌గా రాసుకోవాల్సింది. డైలాగ్‌లు కూడా ఒకటిరెండుతప్పితే వాహ్‌ అనేలా లేవు. పాకిస్థాన్‌ ఎపిసోడ్‌ని బాగా డీల్‌ చేయాల్సింది.

చాలా రొటీన్‌గా డీల్‌ చేయడంతో చప్పగా అనిపిస్తుంది. లవ్‌ ట్రాక్‌ విషయంలోనూ ఇంకా బాగా చేయాల్సింది. ఎమోషనల్‌, డ్రామాకి ప్రయారిటీ ఇచ్చాడు. తన బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నించాడని చెప్పొచ్చు.

ఫైనల్‌గాః సాయిపల్లవి, నాగచైతన్యల నటన కోసం, వారి ప్రేమ చేసే మ్యాజిక్‌ కోసం. 

రేటింగ్‌ః 3
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories