పిల్లలు బంకమట్టి లాంటి వారట..శిల్పా శెట్టి చెబుతున్న ఫిలాసఫీ

First Published Aug 30, 2020, 7:57 PM IST

శిల్సా శెట్టి సాగర కన్యగా తెలుగు ఆడియెన్స్‌ని అలరించిన ఈ సోయగం.. కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత రియాలిటీ డాన్స్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు. అడపాదడపా పలు చిత్రాల్లో గెస్ట్ గా, ప్రత్యేక సాంగ్‌ల్లో మెరిసింది. 

పెళ్ళి తర్వాత ఫ్యామిలీ జీవితానికే పరిమితమైన శిల్పా శెట్టి తమ పిల్లలను చక్కగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమైంది.
undefined
2009లో వ్యాపారవేత్త, రాజస్థాన్‌ రాయల్స్ కో హోనర్‌ రాజకుంద్రా వివాహం చేసుకున్నాక వీరికి ఇద్దరు సంతానం కలిగారు. వారిలో కుమారుడు వియాన్‌ రాజ్‌కుంద్రాతోపాటుసరోగసి ద్వారా మరో కూతురికి ఈ ఏడాది ఫిబ్రవరిలో జన్మనిచ్చారు.
undefined
ప్రస్తుతం వారి బాగోగులు చూసుకుంటోంది శిల్పా. అంతేకాదు వారిని జీవితంలో గొప్పగా మల్చాలని నిర్ణయించుకుంది. తాజాగా ఆ విషయాలను పంచుకుంటూ పిల్లలనుబంకమట్టితో పోల్చింది.
undefined
`పసి పిల్లల మనసు, శరీరం రెండూ బంకమట్టిలాంటిది. మనం ఎలా మలిస్తే అలా తయారవుతారు. అందుకే చిన్నప్పుడే మంచి అలవాట్లు, మంచి ఆటలు నేర్పిద్దాం` అనితెలిపింది.
undefined
శుక్రవారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని విలు విద్య ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోని పోస్ట్ చేసింది శిల్పా. గతంలో ఓ సందర్భంలో విలు విద్య నేర్చుకుందట. ఆవీడియోని తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదని పేర్కొంది.
undefined
`క్రీడలు పిల్లలకు వ్యాయామంలా ఉపయోగపడతాయని, ఆరోగ్యకరమైన పోటీ అలవాటు చేస్తాయని, ఏదో నేర్చుకోవాలనే తపనను రేకెత్తిస్తాయని, ఎల్లప్పుడు యాక్టివ్‌గాఉంచుతాయని, ఆటలు ఆడండి అని పిల్లలకు చెప్పడం కంటే మనం ఆడుతుంటే చూసి ఇంకా చురుకుగా నేర్చుకోవడం జరుగుతుంద`ని చెప్పింది.
undefined
ఇంకా మాట్లాడుతూ, `శుక్రవారంతో ఫిట్‌ ఇండియా ఉద్యమానికి ఏడాది పూర్తవుతుంది. తల్లిదండ్రులందరికి చెప్పేది ఏందంటే మీ పిల్లలకు ఏదో ఒక ఆట నేర్పిస్తూనే ఉండండి.మీరూ కూడా నేర్చుకోండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి` అని పేర్కొంది శిల్పా. ప్రస్తుతం నటిగా రీఎంట్రీ ఇస్తున్న ఈ భామ `నికమ్మా`, `హంగామా 2` చిత్రాల్లోనటిస్తూ బిజీగా ఉంది.
undefined
click me!