`ఫతే` మూవీ 10 రోజుల కలెక్షన్లు.. దర్శకుడిగా మారిన సోనూసూద్‌కి గట్టి దెబ్బ?

Published : Jan 19, 2025, 11:00 PM IST

సోనూ సూద్‌ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తూ నిర్మించిన `ఫతే` మూవీ పది రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందనేది చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.   

PREV
15
`ఫతే` మూవీ 10 రోజుల కలెక్షన్లు.. దర్శకుడిగా మారిన సోనూసూద్‌కి గట్టి దెబ్బ?

రియల్‌ హీరో, రీల్‌ విలన్‌ సోనూ సూద్‌ ఇటీవల `ఫతే` అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఆయనే సొంతంగా ఈ మూవీని నిర్మించడంతోపాటు దర్శకత్వం వహించారు. సోనూ సూద్‌ దర్శకుడిగా మారిన చేసిన మూవీ ఇది. అంతేకాదు హీరోగానూ నటించారు. ఈ మూవీ సంక్రాంతి స్పెషల్ గా జనవరి 10న విడుదలైంది. పాన్‌ ఇండియా వైడ్‌గా దీన్ని రిలీజ్‌ చేశారు. 

25

తాజాగా ఈ మూవీ పది రోజులు పూర్తి చేసుకుంది. నేడు(ఆదివారం) పది రోజులకు చేరుకుంది. మరి సినిమాకి కలెక్షన్లు ఎలా ఉన్నాయి? సోనూ సూద్‌కి హిట్‌ పడిందా? లేక చేదు అనుభవం ఫేస్‌ చేశాడా? అనేది చూస్తే..
 

35

`ఫతే` మూవీ పది రోజుల్లో 23కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. ఈ లెక్కన ఇది రూ.13 కోట్ల షేర్‌ సాధించింది. ఈ మూవీని సుమారు రూ.40కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు సోనూ సూద్‌. ఇందులో సగం కలెక్షన్లు అయినా థియేట్రికల్‌గా వస్తే, మిగిలినవి ఓటీటీ, శాటిలైట్‌ ద్వారా మిగిలిన ఎమౌంట్‌ రాబట్టుకోవచ్చు.

ఈ క్రమంలో ఈ మూవీ పది రోజుల్లో సగం కలెక్షన్లని మాత్రమే సాధించింది. ఇంకా దాదాపు రూ.20-30కోట్లు వస్తేనే సోనూ సూద్‌ సేఫ్‌లోకి వెళ్తాడు. ఈ మూవీ హిట్‌ ఖాతాలోకి వెళ్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సాధ్యమా అనే డౌట్‌ కలుగుతుంది. 
 

45

అయితే సినిమాకి ప్రారంభం నుంచి స్టడీగా కలెక్షన్లు వస్తున్నాయి. యావరేజ్‌గా మెయింటేన్‌ అవుతుంది. ఇది గొప్ప విషయం, ఇదే కంటిన్యూ అవుతే, మరో పది, పదిహేను రోజులు ఆడితేనే ఈ మూవీ సేఫ్‌లోకి వెళ్తుంది, లేదంటే సోనూ సూద్‌కి ఫస్ట్ డైరెక్టోరియల్ వెంచర్‌ చేదు అనుభవాన్ని మిగుల్చుతుంది. అటు దర్శకుడిగానే కాదు, నిర్మాతగానూ కొంత దెబ్బగా పడబోతుందని చెప్పొచ్చు. 
 

55

సోనూ సూర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తూ నటించిన `ఫతే` ఇప్పుడు అంతా ఎదుర్కొంటున్న లోన్‌ యాప్‌ మోసాలను చూపించారు. లోన్‌ యాప్‌ ద్వారా ఓ ఫ్యామిలీ ఎలా డిస్టర్బ్ అయ్యింది. ఆ ఫ్యామిలీ ఎలా నాశనం అయిపోయింది? దాన్ని హీరో ఎలా ఎదుర్కొన్నాడనేది సినిమా.

ఆద్యంతం స్టయిలీష్‌ యాక్షన్‌ మూవీగా తెరకెక్కించాడు సోనూ సూద్‌.యాక్షన్‌ సీన్లు హైలైట్గా నిలుస్తాయి. ఇందులో సోనూ సూద్‌కి జోడీగా జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ హీరోయిన్‌గా నటించింది.  

read  more: బిగ్ బాస్ 18 గ్రాండ్ ఫినాలే: సల్మాన్‌ కి షాకిచ్చిన అక్షయ్‌ కుమార్‌, షూటింగ్‌ లో పాల్గొనకుండానే జంప్‌
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories