బాబోయ్, శర్వానంద్ అరాచకం చూశారా..కెరీర్ లో తొలిసారి సిక్స్ ప్యాక్ లుక్, వైరల్ ఫోటోస్

Published : Oct 24, 2025, 09:59 PM IST

శర్వానంద్‌ తన 36వ చిత్రం ‘బైకర్‌’లో ప్రొఫెషనల్‌ రేసర్‌గా కనిపించబోతున్నారు. ఈ మూవీ కోసం శర్వానంద్ మైండ్ బ్లాక్ చేసేలా తన ఫిజిక్ మార్చుకున్నాడు. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

PREV
15
శర్వానంద్ లేటెస్ట్ మూవీ బైకర్ 

యంగ్ హీరో శర్వానంద్ యూత్ ఫుల్ చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాడు. శర్వానంద్ చివరగా నటించిన మనమే మూవీ డిజాస్టర్ గా నిలిచింది. దీనితో శర్వానంద్ బౌన్స్ బ్యాక్ కావాలని ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ బైకర్. దీపావళి సందర్భంగా విడుదలైన టైటిల్‌ పోస్టర్‌, ఫస్ట్‌ లుక్‌ సోషల్‌ మీడియాలో విశేష స్పందన పొందాయి.ఈ చిత్రానికి దర్శకుడు అభిలాష్‌ కన్కరా కాగా, యూవీ క్రియేషన్స్‌సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. టైటిల్‌తో పాటు పోస్టర్‌లో కనిపించిన శర్వానంద్‌ కొత్త అవతారం అందరినీ ఆకర్షించింది.శర్వానంద్ చాలా స్టైలిష్ గా ఉన్నాడు. 

25
ప్రొఫెషనల్‌ రేసర్‌గా శర్వా

ఈ సినిమాలో శర్వానంద్‌ ప్రొఫెషనల్‌ మోటార్‌సైకిల్‌ రేసర్‌గా కనిపించబోతున్నారు. పాత్ర కోసం ఆయన చేసిన ఫిజికల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ నిజంగా ప్రశంసనీయం. ఇటీవల విడుదలైన ఫోటోషూట్‌ చిత్రాల్లో శర్వా షర్ట్‌లెస్‌గా కనిపిస్తూ, తన ఫిట్‌నెస్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు. స్పష్టంగా కనిపించే సిక్స్‌ప్యాక్‌ యాబ్స్‌, ఇంటెన్స్ లుక్స్, రేసర్‌ స్ఫూర్తిని ప్రతిబింబించే ఆత్మవిశ్వాసం  ఇవన్నీ కలిపి ఆయన లుక్‌ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. చాకొలేట్ బాయ్ లా ఉండే శర్వానంద్ ఇలా సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపిస్తాడని ఎవరూ ఊహించలేదు. అందుకే శర్వానంద్ సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించగానే క్షణాల్లో వైరల్ గా మారింది. శర్వా లుక్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉంది. 

35
నెలల తరబడి శ్రమించిన శర్వా

పాత్రకు తగ్గట్టుగా లీన్‌, అథ్లెటిక్‌ బాడీ కోసం శర్వానంద్‌ నెలల తరబడి కఠినమైన జిమ్ వర్కౌట్స్, కంట్రోల్డ్‌ డైట్‌ పాటించారు. ఈ క్రమశిక్షణ, కష్టపడి చేసిన శ్రమ ఇప్పుడు ఫలితాన్ని ఇచ్చింది. ఫ్యాన్స్‌, సినీ ప్రేమికులు ఆయన కొత్త లుక్‌ను సోషల్‌ మీడియాలో పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

45
టెక్నికల్‌ టీమ్‌, నటీనటులు

ఈ చిత్రంలో మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రముఖ నటులు బ్రహ్మాజీ, అతుల్‌ కులకర్ణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాటోగ్రఫీని జి యువరాజ్‌ నిర్వహిస్తుండగా, సంగీతాన్ని ఘిబ్రాన్‌ అందిస్తున్నారు. ఎడిటింగ్‌ బాధ్యతలు అనిల్‌ కుమార్‌ పి చేపట్టారు. రాజీవన్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ అందిస్తుండగా, ఆర్ట్‌ డైరెక్షన్‌ ఏ. పన్నీర్‌ సెల్వం వద్ద ఉంది. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా ఎన్‌. సందీప్ వ్యవహరిస్తున్నారు.

55
హిట్టు కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్ 

 శర్వానంద్ కి సరైన హిట్ పడి చాలా కాలం అవుతోంది. మరి శర్వానంద్ చేస్తున్న ఈ కొత్త ప్రయత్నం ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. శర్వానంద్ తన కెరీర్ లో గమ్యం, జర్నీ, శతమానం భవతి, మహానుభావుడు, రన్ రాజా రన్ లాంటి హిట్స్ అందుకున్నాడు. 

Read more Photos on
click me!

Recommended Stories