రవితేజ, త్రివిక్రమ్ తనయులకు గొప్ప అవకాశం.. ఇక అంతా ప్రభాస్ చేతిలోనే..

Published : Oct 24, 2025, 08:52 PM IST

త్రివిక్రమ్ శ్రీనివాస్, రవితేజ ల వారసులకు గొప్ప అవకాశం లభించింది. వారి భవిష్యత్తు ప్రభాస్ సినిమాపై ఆధారపడి ఉందని నెటిజన్లు భావిస్తున్నారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
స్పిరిట్ మూవీ సౌండ్ టీజర్

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘స్పిరిట్‌’ ఆడియో టీజర్‌ సోషల్‌ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ టీజర్‌ కేవలం కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్‌ సాధించి ట్రెండింగ్‌లోకి చేరింది. ఈ సినిమాకు సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తుండగా, తృప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది.

25
స్పిరిట్ లో భాగం కానున్న ఇద్దరు స్టార్ల వారసులు

స్పిరిట్ చిత్రానికి సంబంధించిన ఓ సమాచారం అందరిలో ఆసక్తి రేపుతోంది. ఈ సినిమా దర్శకత్వ విభాగంలో ఇద్దరు స్టార్ల వారసులు చేరారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కుమారుడు రిషి మనోజ్ , మాస్ మహారాజ్ రవితేజ కుమారుడు మహాధన్ భూపతిరాజు ‘స్పిరిట్‌’ చిత్రంలో అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌గా పని చేస్తున్నారు.

35
ఇద్దరికీ గొప్ప అవకాశం

ఇది ఇద్దరికీ సినీ పరిశ్రమలో కీలక ఆరంభం కావడం విశేషం. సందీప్ రెడ్డి వంగా వంటి ప్రతిభావంతుడైన దర్శకుడి వద్ద శిక్షణ పొందే అవకాశం రావడం వారిద్దరికీ గొప్ప అనుభవమని ఫిల్మ్‌ వర్గాలు చెబుతున్నాయి. సుకుమార్, రాజమౌళి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్స్ పనిచేసిన వారు కొంతమంది టాలీవుడ్ లో క్రేజీ దర్శకులుగా పనిచేస్తున్నారు. అదే విధంగా త్రివిక్రమ్, రవితేజ తనయులు కూడా ఎదిగే అవకాశం ఉందని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.

45
సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలోనే హైప్

ప్రస్తుతం ‘స్పిరిట్‌’ చిత్రం ప్రీ-ప్రొడక్షన్‌ దశలో ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌తో పాటు ప్రకాశ్ రాజ్‌, వివేక్ ఒబెరాయ్‌, కాంచన తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా బృందం ఈ నెలాఖరులో షూటింగ్‌ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

55
ఆకాశాన్ని తాకే అంచనాలు

ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్‌, ప్రణయ్ రెడ్డి వంగా, కృష్ణ కుమార్‌, ప్రభాకర్ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంగీతం హర్షవర్ధన్ రామేశ్వర్ అందిస్తున్నారు. సినిమాకి సంబంధించిన టీజర్‌ సౌండ్‌ డిజైన్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్‌ నటిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. గతంలో ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలతో దర్శకుడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో ‘స్పిరిట్‌’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories