Sharwanand Wedding: శర్వానంద్‌-రక్షితల రాయల్‌ వెడ్డింగ్‌.. రాజసం ఉట్టిపడుతున్న వైనం.. ఫోటోలు వైరల్‌

Aithagoni Raju | Published : Jun 4, 2023 4:51 PM
Follow Us

టాలీవుడ్‌ యంగ్‌ హీరో శర్వానంద్‌ ఓ ఇంటి వాడయ్యాడు. ఆయన రక్షిత రెడ్డిని వివాహం చేసుకున్నారు. తాజాగా వీరి రాయల్ వెడ్డింగ్‌ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

16
Sharwanand Wedding: శర్వానంద్‌-రక్షితల రాయల్‌ వెడ్డింగ్‌.. రాజసం ఉట్టిపడుతున్న వైనం.. ఫోటోలు వైరల్‌

హీరో శర్వానంద్‌ వివాహం గ్రాండ్‌గా జరిగింది. హైకోర్ట్ లాయర్‌ పసునూరి మధుసూదన్‌ రెడ్డి కూతురు రక్షిత రెడ్డితో శనివారం రాత్రి(ఆదివారం తెల్లవారుజామున) గ్రాండ్‌గా వివాహం జరిగింది. మూడు ముళ్ల బంధంతో వీరిద్దరు ఒక్కటయ్యారు. అతి కొద్ది మంది బంధుమిత్రులు, సినిమా సెలబ్రిటీల సమక్షంలో ఈ వివాహ వేడుక జరగడం విశేషం. 

26

రాజస్థాన్‌లోని జైపూర్‌ ప్యాలెస్‌లో శర్వానంద్‌, రక్షిత ల పెళ్లి వేడుక జరిగింది. అందుకోసం గ్రాండ్‌గా ఏర్పాట్లు చేశారు. అంతేకాదు శర్వా, రక్షితలు సైతం గ్రాండియర్‌గా ముస్తాబయ్యారు. రాయల్‌ లుక్‌లోకి మారిపోయారు. రాయల్‌ డిజైనింగ్‌వేర్‌ కి సంబంధించి పెళ్లిదుస్తులు ధరించారు. 

36

ఈ సందర్భంగా శర్వానంద్‌, రక్షిత రెడ్డిలు కలిసి ఫోటో షూట్‌ చేశారు. ఇందులో ఈ ఇద్దరు రాజకుటుంబానికి చెందిన జంటని తలపించడం.. రాజకుమారుడు, రాజకుమారిలను తలపించడం విశేషం. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

Related Articles

46

మరోవైపు పెళ్లి సందర్బంగా ఈ ఇద్దరు ఒకరిపై ఒకరు పూలు చల్లుకోవడం, అత్యంత ఆనందకర వాతావరణంలో తమ పెళ్లిని చేసుకోవడాన్ని తలపించే ఫోటో సైతం ఆకట్టుకుంటుంది. ఇది వైరల్‌గా మారింది. 
 

56

ఇందులో రామ్‌చరణ్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఇండస్ట్రీ నుంచి ఆయన పాల్గొనడం విశేషం. రామ్‌చరణ్‌, శర్వానంద్‌ చిన్నప్పట్నుంచి మంచి స్నేహితులు. ఈ నేపథ్యంలో ఫ్రెండ్‌ కోసం జైపూర్‌కి వెళ్లారు చరణ్‌. రెండు రోజులుగా ఆయన అక్కడే ఉన్నారు. 
 

66

పెళ్లి మండపంలో పూజారి మంత్రోచ్ఛరణలతో పెళ్లి కార్యక్రమం హిందూ సంప్రదాయంలో జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్ గా మారింది. శర్వానంద్‌, రక్షిత ఎంగేజ్మెంట్‌ జనవరి చివర్లో జరిగిన విషయం తెలిసిందే. సినిమాలతో శర్వా బిజీగా ఉండటంతో మ్యారేజ్‌కి డిలే అయ్యింది. ఎట్టకేలకు మూడుముళ్లతో ఈ ఆదివారం ఓ ఇంటివాడయ్యాడు శర్వానంద్‌. 
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Recommended Photos