హీరో, డైరెక్టర్ కెన్ కరునాస్ మాట్లాడుతూ, `శర్వానంద్ `బైకర్` మూవీ ట్రైలర్ బాగుంది. ఆ మూవీని ఇక్కడికి వచ్చి చూస్తాను. సందీప్, వినీత్ మా మూవీ కంటెంట్ ను నమ్మి తెలుగులో రిలీజ్ చేశారు. తెలుగు ఆడియెన్స్ కంటెంట్ ముఖ్యమని మరోసారి ప్రూవ్ చేశారు. మాలాంటి కొత్త వాళ్ల సినిమాను కూడా థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు. మా మూవీ మా దగ్గర సక్సెస్ కావడం సంతోషం, కానీ మరో రాష్ట్రంలో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసి సక్సెస్ కావడం ఇంకా సంతోషంగా ఉంది. ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రశంసలే మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. నేను ఈ సినిమాలో ప్రభాస్ గారి అభిమానిగా నటించాను. ప్రభాస్ అభిమానులు అంతా మా మూవీని సపోర్ట్ చేస్తున్నారు. మీరు మీ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్ తోనే కాదు ఫ్యామిలీతో కూడా మా మూవీని చూడండి` అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నటుడు చిన్నా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సతీష్, ప్రొడ్యూసర్ సందీప్, వినీత్, హీరోయిన్ మీనాక్షి, ప్రియాన్షి, దర్శకుడు వశిష్ట, నిర్మాత ధీరజ్ మొగిలినేని వంటి వారు పాల్గొన్నారు.