శర్వానంద్‌లో మార్పుకి కారణమిదే.. భార్యతో విడాకులు.. అసలు విషయం బయటపెట్టిన హీరో

Published : Nov 12, 2025, 04:51 PM IST

Sharwanand: శర్వానంద్‌ తన భార్యతో విడిగా ఉంటున్నారని, విడాకులు తీసుకోబోతున్నారనే రూమర్లు ఆ మధ్య వినిపించిన నేపథ్యంలో తాజాగా వాటికి క్లారిటీ ఇచ్చారు శర్వానంద్‌. 

PREV
14
విడాకుల రూమర్లకి శర్వానంద్‌ చెక్‌

హీరో శర్వానంద్‌ చాలా గ్యాప్‌తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఆయన `బైకర్‌` అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కాబోతుంది. ఇందులో రాజశేఖర్‌ కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. దీంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సందర్భంగా శర్వానంద్‌ లుక్‌ అందరిని ఆశ్చర్యపరిచింది. ఆయన చాలా సన్నగా కనిపించారు. లేటెస్ట్ ఫోటో షూట్‌ పిక్స్ ని చూసిన అభిమానులు శర్వానంద్‌కి ఏమైందనే సందేహాలు వ్యక్తం చేశారు. కానీ ఆయన ఫిట్‌ నెస్‌పై ఫోకస్‌ పెట్టినట్టు చెప్పారు. తాజాగా ఓ యూట్యూబ్‌ ఇంటర్వ్యూలో ఈ విషయాలపై స్పందించారు శర్వానంద్. విడాకుల రూమర్లకి చెక్‌ పెట్టారు. 

24
కూతురు వచ్చాకే మార్పు

శర్వానంద్‌ విడాకులు తీసుకుంటున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. రెండేళ్ల క్రితం ఆయన రక్షితా రెడ్డిని వివాహం చేసుకున్నారు. వీరికి ఆ మధ్య కూతురు కూడా జన్మించింది. కానీ అప్పుడే వీరిద్దరు విడిపోతున్నట్టుగా ప్రచారం జరిగింది. తాజాగా వాటికి చెక్‌ పెట్టారు శర్వానంద్‌. పరోక్షంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తనకు కూతురు జన్మించిన తర్వాత చాలా మారిపోయినట్టు వెల్లడించారు శర్వా. మనిషికి ఆరోగ్యమే మహాభాగ్యం అని, ఈ విషయం కూతురు జన్మించిన తర్వాతనే తనకు అర్థమయ్యిందన్నారు. అంతకు ముందు ఎప్పుడూ వర్కౌట్‌ చేయలేదని, కూతురు పుట్టాకే ఫిట్‌నెస్‌, ఆరోగ్యంపై ఫోకస్‌ పెట్టినట్టు తెలిపారు శర్వా. ఫ్యామిలీ కోసం స్ట్రాంగ్‌గా మారాలని నిర్ణయించుకున్నానని, ఇప్పుడు అన్నింటి కంటే ఆరోగ్యానికే ప్రయారిటీ ఇస్తున్నట్టు చెప్పారు శర్వా.

34
కుటుంబం కోసం శర్వానంద్‌

దీంతో తాము కలిసే ఉన్నామనే విషయాన్ని శర్వానంద్‌ చెప్పకనే చెప్పారు. కుటుంబం కోసం ఆరోగ్యంగా ఉండాలని నిర్ణయించుకున్నారని చెప్పడంలోనే ఆయన ఫ్యామిలీకి ఇస్తున్న ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. ఇలా శర్వానంద్‌ ప్రస్తుతం ఫ్యామిలీతోనే ఉంటున్నారని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం శర్వానంద్‌ నటిస్తోన్న `బైకర్‌` మూవీకి అభిలాష్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్‌ 6న విడుదల కాబోతుంది.

44
బ్యాక్‌ టూ బ్యాక్‌ మూడు సినిమాలతో శర్వానంద్‌

మరోవైపు `సమజవరగమన` చిత్ర దర్శకుడు రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో `నారి నారి నడుమ మురారి` చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతుంది. అలాగే సంపత్‌ నందితో `భోగి` అనే సినిమాలో నటిస్తున్నారు శర్వా. ఇది మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. ఇది కూడా వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. ఇలా ఇప్పుడు కొంత గ్యాప్‌తో బ్యాక్‌ టూ బ్యాక్‌ చిత్రాలతో ఎంటర్‌టైన్‌ చేయబోతున్నారు శర్వానంద్‌. మరి ఈ చిత్రాలైనా ఆయనకు హిట్‌ని ఇస్తాయా? అనేది చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories