OkeOka Jeevitham Review:ఒకే ఒక జీవితం ట్విట్టర్ టాక్.. ఎట్టకేలకు హిట్ కొట్టిన శర్వానంద్.. సినిమాలో అవే హైలెట్!

First Published | Sep 9, 2022, 1:53 AM IST

హిట్ కోసం డిఫరెంట్ జోనర్స్ ట్రై చేస్తున్న శర్వానంద్ ఈసారి సైన్స్ ఫిక్షన్ స్టోరీ ఎంచుకున్నాడు. కొత్త దర్శకుడు శ్రీ కార్తీక్ తెరకెక్కించిన ఒకే ఒక జీవితం మూవీ శర్వానంద్ హిట్ దాహం తీర్చిందా? ట్విట్టర్ లో సినిమా గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం...

తమ జీవితంలో కోల్పోయిన వాటిని గతంలోకి వెళ్లి తిరిగి దక్కించుకోవాలని ముగ్గురు యువకులు శర్వానంద్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి ఆశపడతారు. సైంటిస్ట్ నాజర్ తయారు చేసిన టైం ట్రావెలర్ లో గతంలోకి వెళ్లి తమ ఆశలు నెరవేర్చుకోవాలి అనుకుంటారు. గతంలోకి వెళ్లిన ఈ ముగ్గురు మిత్రులు చిన్న పిల్లలుగా మారిపోతారు. అనుకున్నట్లుగా ఈ ముగ్గురు కుర్రాళ్ల ఆశలు నెరవేరాయా? సేఫ్ గా ప్రెజెంట్ లోకి వచ్చారా? లేదా? అనేది ఒకే ఒక జీవితం మూవీ కథ... 

శర్వానంద్ హిట్ కొట్టి ఏళ్ళు గడిచిపోతుంది. ఈ మధ్య కాలంలో ఆయన నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. వరుస ప్లాప్స్ తో కెరీర్ ప్రమాదంలో పడే పరిస్థితి. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో శర్వా రెగ్యులర్ మూవీ కాకుండా ఓ ప్రయోగాత్మక చిత్రం ఎంచుకున్నాడు. 
 

Latest Videos



నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో ఓ ఎమోషనల్ స్టోరీ రాసుకొని శర్వానంద్ ని ఒప్పించాడు. శర్వా నమ్మకాన్ని నిలబెడుతూ ఒకే ఒక జీవితం పాజిటివ్ టాక్ అందుకుంటుంది. నెటిజెన్స్ ఒకే ఒక జీవితం చిత్రం పట్ల పాజిటివ్ గా స్పందిస్తున్నారు. సినిమాకు మంచి మార్కులు వేస్తున్నారు. 
 


కథ, కథనం దర్శకుడు చక్కగా రాసుకున్నాడని ప్రేక్షకుల అభిప్రాయం. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ దర్శకుడు శ్రీ కార్తీక్ అద్భుతంగా నడిపించాడు. ఇంటర్వెల్ ట్విస్ట్,సన్నివేశాలు హైలెట్ అంటున్నారు. మొదటి భాగంలో సినిమా ఎక్కడా నెమ్మదించకుండా వేగంగా సాగిపోతుంది. 
 

ఇక సెకండ్ హాఫ్ లో కొంత మేర నెమ్మదిస్తుంది. కొన్ని బోరింగ్ సన్నివేశాలు ఇబ్బంది పెడతాయి. అయితే క్లైమాక్స్ నీట్ గా రూపొందించాడు. సినిమాకు ఎమోషనల్ ఎండింగ్ ప్లస్ అయ్యిందంటున్నారు. నిర్మాణ విలువలతో పాటు సినిమాటోగ్రఫీ, బీజీఎమ్, ప్రొడక్షన్ డిజైన్ మెప్పిస్తాయి అంటున్నారు. 
 


 ఓ ఫిక్షనల్ కథకు రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్, సస్పెన్సు వంటి కమర్షియల్ అంశాలు తగిన మోతాదులో కలగలిపి దర్శకుడు శ్రీ కార్తీక్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక మెయిన్ కాస్ట్ శర్వానంద్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. చైల్డ్ ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. 
 


నాజర్, అమల నటన సినిమాకు మరో ఆకర్షణ. హీరోయిన్ రీతూ వర్మ తన పాత్ర పరిధిలో అలరించారు. సెకండ్ హ్లాఫ్ లో నెమ్మదించే కథనం, ఎడిటింగ్ మినహాయిస్తే అన్ని విభాగాల్లో ఒకే ఒక జీవితం మెప్పించింది. ఫిక్షనల్ కథను ఉన్నతమైన స్క్రీన్ ప్లే తో కమర్షియల్ అంశాలు జోడించి ఆకట్టుకునేలా దర్శకుడు శ్రీ కార్తీక్ తెరకెక్కించాడు. ఒకే ఒక జీవితం చిత్రం పట్ల నెటిజెన్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. 
  

click me!