ప్రస్తుతం దేశం మొత్తం బ్రహ్మాస్త్ర చిత్రం వైపు ఆసక్తిగా చూస్తోంది. సూపర్ హీరో మూవీగా పౌరాణిక అంశాలతో ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు. పాన్ ఇండియా సినిమాగా దక్షణాది భాషల్లో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రానికి రాజమౌళి ప్రజెంటర్ గా వ్యవహారిస్తున్నారు. బాలీవుడ్ లో వరుస పరాజయాలు, బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో బ్రహ్మాస్త్రం పరిస్థితి ఏంటి అనే చర్చ జరుగుతుంది. నేడు ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. దీనితో ట్విట్టర్ లో ప్రేక్షకుల హంగామా మొదలైంది.
బ్రహ్మాస్త్ర బాయ్ కాట్ ట్రెండ్ ని అధికమించగలుగుతుందా ? బాలీవుడ్ వరుస పరాజయాలకు బ్రేక్ వేయగలుగుతుందా ? అనేది ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం. ట్విట్టర్ లో బాయ్ కాట్ ట్రెండ్ విపరీతంగా ఉండడంతో కొన్ని నెగిటివ్ ట్వీట్స్ కనిపిస్తున్నాయి. కానీ జెన్యూన్ గా చాలా మంది ఈ చిత్రానికి పాజిటివ్ గా రెస్పాన్స్ ఇస్తున్నారు.
ఇలాంటి సూపర్ హీరో చిత్రాలకు బలమైన కథ ఉంటుందని అనుకుంటారు. కానీ దర్శకుడు అయాన్ ముఖర్జీ సింపుల్ స్టోరీ లైన్ తీసుకున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, నటీనటుల సాయంతో అద్భుతంగా కథని చెప్పగలిగారు అని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు.
నెగిటివ్ ట్వీట్స్ చేస్తున్న వారు ఈ చిత్రం అసలు బాగాలేదని.. విజువల్ ఎఫెక్ట్స్ లేజర్ షోని తలపించేలా, లైట్ సెట్టింగ్ ని తలపించేలా ఉన్నాయి అంటున్నారు. కళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేలా ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ తీర్చి దిద్దారు అంటూ కొందరు ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు.
శివ నా మైండ్ బ్లో చేశాడు. నా ఫస్ట్ బాలీవుడ్ మూవీ ఏపీరియన్స్ ఇది. రెండు గంటల 40 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం నాకు మర్వెల్ సినిమా ఫీలింగ్ ఇచ్చింది అని ఓ హాలీవుడ్ క్రిటిక్ ట్వీట్ చేశారు.
ఈ చిత్రం థియేటర్స్ లో అద్భుతమైన అనుభూతి కోసం తెరకెక్కించారు. సినిమా చూసి చెబుతున్నా మిస్ కావొద్దు. ఈ బాయ్ కాట్ ట్రెండ్ ని పట్టించుకోవద్దు అని ఓ నెటిజన్ ట్వీట్ చేసారు. రణబీర్ శివ పాత్ర, అలియా నటన, నాగార్జున, అమితాబ్ పాత్రలు ఈ చిత్రానికి పాజిటివ్ అంశాలు. బిజియం ఇంకా బావుండాల్సింది. విఎఫెక్స్ పర్వాలేదు అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు.
బ్రహ్మాస్త్ర దుబాయ్ షో చూసి చెబుతున్నా.. ఈ చిత్రం అంచనాలు అందుకుంది. హైప్ కి తగ్గట్లుగా సినిమా మెప్పించింది అని ఓ నెటిజన్ తన అభిప్రాయం తెలిపారు. ఎవరి గురించి పట్టించుకోకుండా అలియా భట్ కోసం ఈ మూవీ చూడండి. అందంగా కనిపిస్తూ అద్భుతంగా నటించింది అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఓవరాల్ గా బ్రహ్మాస్త్ర చిత్రానికి ట్విట్టర్ లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.