2021 నుంచి మీడియాను దూరం పెట్టిన షారుఖ్ ఖాన్.. తన కొడుకును ఏమైనా అంటే అంతు చూస్తానంటోన్న బాద్ షా

Published : Jun 09, 2024, 07:41 PM IST

చాలా కాలంగా మీడియాను దూరం పెట్టారు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. మీడియా అంటే మండిపడుతున్నారు. కారణం  ఏంటో తెలుసా.. తన కొడుకు ఆర్యన్ ఖాన్. ఇంతకీ అతను ఏం చేశాడు..?   

PREV
15
2021 నుంచి మీడియాను  దూరం పెట్టిన షారుఖ్ ఖాన్.. తన కొడుకును ఏమైనా అంటే అంతు చూస్తానంటోన్న బాద్ షా

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ 2021 నుంచి మీడియాకు, మీడియా ఫోటో గ్రాఫర్స్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు.  కెమెరాలు.. మైక్ లను చూస్తే మండిపడుతున్నాడు షారుఖ్. ఎక్కడికైన ఈవెంట్లకు, సినిమా ఫంక్షన్స్ కు వెళ్లినా.. ఫోటో గ్రాఫర్స్ కు ఫోజులివ్వడం కూడా మానేశాడు షారుఖ్ ఖాన్. అంతలా వారిపై ద్వేషం పెంచుకోవడానికి కారణం ఏమిటి.  అసలు బయట కనిపించడంమే మానేసిన షారుఖ్ మీడియానునిర్లక్ష్యం చేయడానికి  రీజన ఏంటో తెలుసా..? 

25

ముంబైకి చెందిన పాపరాజు వరీందర్ చావ్లా మాట్లాడుతూ.. షారూఖ్ ఖాన్ మీడియాతో విసిగిపోయి మీడియాకు దూరంగా ఉంటున్నాడని అన్నారు. తన కొడుకు ఆర్యన్‌ఖాన్‌ అరెస్ట్‌పై మీడియా ఎక్కువ శ్రద్ధ చూపడం వల్లే తనకు మీడియాపై కోపం వచ్చిందని.. అందుకే మీడియాకు దూరంగా ఉంటున్నట్టు  షారుక్ ఓ సందర్భంలో చెప్పారట. 

35

'డ్రగ్స్ ఆన్ క్రూజ్' కేసులో ఆర్యన్ 2021 అక్టోబర్‌లో అరెస్టయ్యాడు. 22 రోజుల పాటు పోలీసు కస్టడీలో ఉన్నాడు. షారుక్ జైలులో ఆర్యన్‌ను కలిశాడు. చాలా ప్రయత్నాల తరువాత  ఆర్యన్ చివరికి విడుదలయ్యాడు. అంతే కాదు  ఆరోపణల నుండి నిర్దోషిగా ప్రకటించారు కూడా. అయితే ఈ విషయంలో షారుఖ్ చాలా ఖర్చు పెట్టాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ టోటల్ ఎపిసోడ్ మీడియాకు హాట్ టాపిక్‌గా మారింది. 

45

షారూఖ్ చావ్లాకు ఫోన్ లో చేసి మాట్లాడారట. తాను మీడియాకు దూరంగా ఎందుకు ఉంటాను అనే విషయం తను అప్పుడు అర్ధం అయ్యింది అంటున్నాడు చావ్లా.  అతను మాట్లాడుతూ..  షారుక్ ఫోన్ చేశాడు. ఐదు నిమిషాలకు పైగా మాట్లాడుకున్నాం. అతనితో మాట్లాడిన తరువాత, అతని పిల్లలు, అతని కుమారుడు ఆర్యన్ ఖాన్ పట్ల అతని ప్రేమను నేను గ్రహించాను. నాకు కూడా పిల్లలు ఉన్నారు, ప్రజలు నా పిల్లల గురించి చెడుగా మరియు ప్రతికూలంగా మాట్లాడితే, నేను కూడా బాధపడతాను. 
 

55

అలాగే షారుఖ్ ఖాన్ కూడా తన కొడుకు గురించి మీడియా ఉన్నవీ లేనివి ప్రచారం చేసేసరికి  చాలా బాధపడ్డాడు, కలత చెందాడు. అందకే మీడియాకు ఫోటోలు ఇవ్వడం.. వారితో మాట్లాడటం లాంటివి మానేశాడు.  ఈసంఘటన తో మూడు సంవత్సరాల తర్వాత, బాబా సిద్ధిఖీ యొక్క ఈద్ పార్టీతో సహా షారుఖ్ రెండు సందర్భాలలో మాత్రమే కెమెరాలకు పోజులిచ్చాడు. 
 

Read more Photos on
click me!

Recommended Stories