స్టార్ హీరోల్లో మహేష్ చాలా ప్రత్యేకం. అందుకే ఆయనకు అశేష అభిమానులు ఉన్నారు. తండ్రి కృష్ణ వారసత్వాన్ని నిలబెడుతూ ఆయన సూపర్ స్టార్ అయ్యారు. కాగా మహేష్ చెన్నైలో పుట్టి పెరిగారు. ఇద్దరు కోలీవుడ్ స్టార్స్ ఆయన క్లాస్ మేట్స్.
సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టార్ డమ్ తెచ్చుకున్న ఏకైక నటుడు మహేష్ బాబు. టీనేజ్ లోనే మహేష్ సోలో హీరోగా సినిమాలు చేశాడు. అలాగే అన్న, నాన్నలతో కలిసి మల్టీస్టారర్స్ లో నటించారు.
25
Mahesh Babu
ఇక చెన్నైలో పుట్టి పెరిగిన మహేష్ కి తెలుగు చదవడం, రాయడం రాదు. ఆయనకు ఇంగ్లీష్ భాషపై మంచి పట్టు ఉంది. ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడగలిగిన మహేష్ బాగా రాయగలరు. ఇక మహేష్ కి కోలీవుడ్ కి చెందిన ఇద్దరు టాప్ స్టార్స్ క్లాస్ మేట్స్ కావడం విశేషం.
35
Krishna Birth Anniversary
అప్పట్లో టాలీవుడ్ కూడా చెన్నైలో ఉండేది. కాబట్టి మన తెలుగు హీరోల నివాసాలు కోలీవుడ్ స్టార్స్ నివాసాలు ఉండే ప్రాంతాల్లో ఉండేవి. కోలీవుడ్ నటులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు. ఇక వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు ఓకే స్కూల్ లో చదువుకొనేవారు.
45
ఇక విజయ్ దర్శకుడు చంద్రశేఖర్ కుమారుడు. చిత్ర పరిశ్రమకు చెందిన కుటుంబాలు కావడంతో ఈ ముగ్గురు ఒకే విద్యాసంస్థలో చదువుకున్నారు. అలాగే మహేష్ తో విజయ్ కి మరొక సంబంధం ఉంది. మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా ఉన్న ఒక్కడు, పోకిరి చిత్రాలను విజయ్ రీమేక్ చేశాడు. తమిళంలో కూడా భారీ విజయం సాధించిన ఈ మూవీస్ విజయ్ ఇమేజ్ పెంచాయి.
55
vijay Mahesh Babu
ఈ క్రమంలో మహేష్ కి కోలీవుడ్ లో స్టార్ హీరోలుగా ఉన్న కార్తీ, విజయ్ క్లాస్ మేట్స్ అట. ఈ ముగ్గురు కలిసి చదువుకున్నారట. పలు సందర్భాల్లో ఈ విషయాన్ని ఈ హీరోలు వెల్లడించారు. కార్తీ నటుడు శివ కుమార్ చిన్న కొడుకు కాగా, సూర్య ఆయనకు పెద్ద కుమారుడు. కార్తీ అద్భుతమైన సబ్జక్ట్స్ ఎంచుకుంటూ తెలుగులో కూడా మార్కెట్ తెచ్చుకున్నాడు.