దాదాపు 250 సినిమాల్లో నటించారు శరత్ బాబు. తెలుగు, తమిళ, కన్నడ,హిందీ, మలయాళం ఐదు భాషల్లో అద్భుతమైన సినిమాలు చేశారు. ఇక ఈ సినిమాల్లో దాదాపు 70 సినిమాల్లో ఆయన హీరోగా నటించి మెప్పించారు. మొత్తం 8 నందీ అవార్డ్ లు అందుకున్న శరత్ బాబు.. మూడుసార్లు వరుసగా నంది అవార్డులను అందుకున్నారు.