పెద్దవారు మీరే దిగులు పెట్టుకుంటే ఎలా అంటూ ఓదారుస్తుంది. నీ మాటలు నాకు ఓదార్పునిస్తున్నాయి థాంక్యూ అంటుంది శారదమ్మ. ఇంతకీ మా అప్పు ఎలా ఉంది అంటుంది అంజలి. తను ఎక్కడికి ఎందుకు వస్తుంది, ఇక్కడ లేదు అంటుంది శారదమ్మ. మీ దగ్గర ఉంటే కాస్త ఊరటగా ఉంటుందని నేనే పంపించాను అంటూ కంగారుగా చెప్తుంది అంజలి. అయ్యో కడుపుతో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్లిందో ఏంటో అంటూ కంగారుపడుతుంది శారదమ్మ. నేను వెళ్లి వెతుకుతాను అని అంజలి అంటే వద్దు నేను వెతుకుతాను దొరికిన వెంటనే ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేసి కంగారుగా బయటికి బయలుదేరుతాడు నీరజ్.