KBKJ First Review: కీసి కా భాయ్ కీసి కీ జాన్ ప్రీమియర్ టాక్: సల్మాన్ మూవీ హిట్టా? ఫట్టా?

Published : Apr 21, 2023, 05:52 AM ISTUpdated : Apr 21, 2023, 06:07 AM IST

సల్మాన్ ఖాన్-పూజా హెగ్డే జంటగా  ఫర్హాద్ సామ్జీ తెరకెక్కించిన ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్.  ఏప్రిల్ 21న విడుదలైన ఈ చిత్ర ప్రీమియర్స్ ముగిశాయి. టాక్ ఎలా ఉందో చూద్దాం...   

PREV
18
KBKJ First Review:  కీసి కా భాయ్ కీసి కీ జాన్ ప్రీమియర్ టాక్: సల్మాన్ మూవీ హిట్టా? ఫట్టా?
Kisi Ka Bhai Kisi Ki Jaan Review

సల్మాన్ ఖాన్ తన రేంజ్ హిట్ ఇచ్చి చాలా కాలం అవుతుంది. ఈ మధ్య కాలంలో ఆయన నుండి వచ్చిన ఒక్క చిత్రం కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. దబంగ్ 3, రాధే డిజాస్టర్స్ గా నిలిచాయి. సల్మాన్ పని అయిపోయిందని యాంటీ ఫ్యాన్స్ ఎద్దేవా చేస్తున్న వేళ ఆయన రీమేక్ కి నమ్ముకున్నారు. ఇదో సెంటిమెంట్ కూడాను. గతంలో సల్మాన్ ఖాన్ వరుస పరాజయాలతో ఇబ్బంది పడ్డారు. ఆ టైం లో సౌత్ రీమేక్ వాంటెడ్ ఆయన్ని కాపాడింది. 
 

28
Kisi Ka Bhai Kisi Ki Jaan Review

సూపర్ స్టార్ మహేష్ బాబు-పూరి జగన్నాధ్ కాంబోలో విడుదలైన పోకిరి చిత్రాన్ని సల్మాన్ వాంటెడ్ టైటిల్ తో రీమేక్ చేశాడు. అక్కడ కూడా సూపర్ హిట్ కొట్టింది. తర్వాత బాడీగార్డ్, కిక్ వంటి రీమేక్స్ సల్మాన్ ఖాన్ కి మంచి ఫలితాలు ఇచ్చాయి. బహుశా ఈ కారణంతోనే సల్మాన్ మరో సౌత్ రీమేక్ కి మొగ్గు చూపి ఉండవచ్చు. తమిళ చిత్రం వీరమ్ రీమేక్ గా కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ తెరకెక్కింది. 
 

38
Kisi Ka Bhai Kisi Ki Jaan Review

ఇటు పూజా హెగ్డేకి కూడా కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చిత్ర విజయం చాలా అవసరం. ఆమె పరిస్థితి మరీ దారుణం. గత ఏడాది ఆమె ఏకంగా నాలుగు డిజాస్టర్స్ ఇచ్చింది. ఆచార్య, రాధే శ్యామ్, బీస్ట్, సర్కస్ చిత్రాలు ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇది ఆమె కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపింది. టాలీవుడ్ ఆమెను పక్కన పెట్టిన సూచనలు కనిపిస్తున్నాయి. 
 

48
Kisi Ka Bhai Kisi Ki Jaan Review

ఇలాంటి పరిస్థితుల మధ్య కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ భారీగా విడుదల చేస్తున్నారు. ఒక్క ఇండియాలోనే 4500 స్క్రీన్స్ లో విడుదల చేస్తున్నారు. ఓవర్సీస్లో మరో 1200 స్క్రీన్స్. మొత్తంగా వంద దేశాల్లో కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ విడుదల అవుతుంది. ప్రతి రంజాన్ కి ఒక చిత్రాన్ని విడుదల చేయడం సల్మాన్ కి సెంటిమెంట్. ఈ పండగకు విడుదలైన సల్మాన్ చిత్రాలు సంచలన విజయాలు నమోదు చేశాయి. ఇది కూడా ఓ పాజిటివ్ సెంటిమెంట్. 
 

58

ఓవర్సీస్లో ప్రీమియర్స్ ముగియగా టాక్ ఎలా ఉందో చూద్దాం... సౌత్ ఇండియా మూవీ రీమేక్ కాగా తెలంగాణ నేపధ్యాన్ని జోడించి కథ నడిపారు. హీరోయిన్ పూజా హెగ్డే తెలుగు అమ్మాయిగా ఈ మూవీలో కనిపిస్తుంది. వెంకటేష్ ఆమె అన్నయ్య పాత్ర చేశారు. ఈ తెలుగు ఫ్యామిలీకి వచ్చిన కష్టం ఏమిటీ? భాయ్ జాన్ ఎందుకు రంగంలోకి దిగాడు? అనేదే కథ. కథలో భాగంగా సౌత్ ఇండియా మసాలా కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ మూవీలో బాగా దట్టించారు.

68
Kisi Ka Bhai Kisi Ki Jaan

ప్రీమియర్స్ చూసిన ఆడిషన్స్ సల్మాన్ ఖాన్ ప్రెజెన్స్, యాక్షన్ ఫ్యాన్స్ కి ట్రీట్ అంటున్నారు. సౌత్ ఇండియా కల్చర్ లో సల్మాన్ ఖాన్ మాస్ గెటప్స్ ఆకట్టుకుంటాయి. అలాగే పూజా హెగ్డే గ్లామర్ హైలెట్. కొన్ని యాక్షన్ సన్నివేశాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. మెట్రో ట్రైన్ ఫైట్ అద్భుతంగా ఉందంటున్నారు. ఇంటర్వెల్ ట్విస్ట్ మెప్పిస్తుంది.

78

హీరో వెంకటేష్ క్యారెక్టర్, రామ్ చరణ్ స్పెషల్ అప్పీరెన్స్ సినిమాలో మరికొన్ని పాజిటివ్ పాయింట్స్. రెండు సాంగ్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయని అంటున్నారు. అయితే సినిమా గురించి కొందరు నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదంటున్నారు. సౌత్ ఇండియా ఫ్లేవర్ ఎక్కువ కావడం కూడా ఒక మైనస్ అంటున్నారు.

88

ప్రీమియర్ చూసిన ఆడియన్స్ మూవీ రిజల్ట్ పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పూర్తి రివ్యూ వస్తే కానీ ఒక అంచనాకు రాగలం. కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ స్వయంగా నిర్మించారు. రవి బస్రూర్ బీజీఎం అందించారు. సాంగ్స్ పలువురు మ్యూజిక్ డైరెక్టర్స్ కంపోజ్ చేశారు.

click me!

Recommended Stories