Virupaksha Review: విరూపాక్ష ట్విట్టర్‌ రివ్యూ.. సాయిధరమ్‌ తేజ్‌ బౌన్స్ బ్యాకా?

First Published | Apr 21, 2023, 5:55 AM IST

ప్రమాదం తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ నుంచి వస్తోన్న సినిమా `విరూపాక్ష`. నేడు ఈ చిత్రం విడుదలవుతుంది. ముందుగా ఓవర్సీస్‌లో సినిమా చూసిన ఆడియెన్స్  స్పందన ఎలా ఉందో ట్విట్టర్‌ రివ్యూలో తెలుసుకుందాం. 

మెగా సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ `చిత్రలహరి`, `సోలో బ్రతుకే సో బెటర్‌`, `ప్రతి రోజు పండగే` వంటి డీసెంట్‌ హ్యాట్రిక్‌ హిట్ల తర్వాత `రిపబ్లిక్‌` చిత్రంతో బోల్తా కొట్టాడు. అంతేకాదు రియల్‌ లైఫ్‌లోనూ ఆయన పెద్ద ప్రమాదానికి గురయ్యారు. చావుబతుకులతో పోరాడి గెలిచాడు. యాక్సిడెంట్‌ నుంచి కోలుకుని ఇప్పుడు మళ్లీ పూర్వ స్థితికి చేరుకోవడమే కాదు `విరూపాక్ష` అనే ఓ డిఫరెంట్‌ జోనర్‌ సినిమాతో వస్తున్నారు. తన కెరీర్‌లో మొదటిసారి హర్రర్‌, థ్రిల్లర్‌, సస్పెన్స్, ఫాంటసీ ఎలిమెంట్లతో కూడిన సినిమా చేశారు. సంయుక్త మీనన్‌ కథానాయికగా నటించగా, కార్తీక్‌ వర్మ దండు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సుకుమార్‌ స్క్రీన్‌ ప్లే అందించిన ఈ చిత్రాన్ని సుకుమార్‌ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకాలపై బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌, సుకుమార్‌ నిర్మించారు. నేడు(ఏప్రిల్‌ 21) శుక్రవారం ఈ సినిమా విడుదల అవుతుంది. ముందుగా యూఎస్‌ వంటి ఓవర్సీస్‌లో సినిమాని ప్రదర్శించారు. అక్కడి టాక్‌ ఎలా ఉందో `ట్విట్టర్‌ టాక్‌`లో తెలుసుకుందాం. 

`విరూపాక్ష` 1980-90లో రుద్రవరం అనే విలేజ్‌లో జరిగే కథ. అప్పటి కొన్ని సంఘటనలను బేస్‌ చేసుకుని, కల్పితాన్ని జోడించి కథగా రాసుకున్నారు దర్శకుడు కార్తీక్‌ దండు. అప్పట్లో రుద్రవరం అనే ఊర్లో వరుస మరణాలు చోటు చేసుకుంటాయి. ఆ మిస్టరీ డెత్స్ వెనకాల ఎవరున్నారు? ఆ ఊరిని పట్టిపీడుస్తున్న శక్తి ఏంటి? హీరో దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు, ఆ ఊరుప్రజలకు ఎలాంటి విముక్తిని ఇచ్చాడు? హీరోలో ఉన్న పవర్స్ ఏంటనేది సినిమా కథ అని తెలుస్తుంది. దర్శకుడు కార్తీక్‌.. సుకుమార్‌ శిష్యుడు. ఓవైపు దర్శకుడు సుకుమార్‌ సంచలనాలు సృష్టిస్తున్నారు. ఆయన శిష్యులు కూడా దర్శకులుగా మారి హిట్లతో సెంచరీ(కలెక్షన్లు)లు కొడుతున్నారు. ఇప్పుడు కార్తీక్‌ వంతు వచ్చింది. ఆయన కూడా సెంచరీ కొడతాడా? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మరి విదేశాల్లో ఈ సినిమాకి ఎలాంటి స్పందన ఉందనేది ఇప్పుడు కీలకంగా మారింది. 
 


సినిమాకి చాలా వరకు పాజిటివ్‌ టాక్‌ వస్తుంది. దర్శకుడు కార్తీక్‌ సినిమాని చాలా బాగా హ్యాండిల్‌ చేశాడట. ఆడియెన్స్ ని ఎంగేజ్‌ చేసేలా, కథలో ఇన్‌వాల్వ్ అయ్యేలా చేశాడంటున్నారు. స్టోరీ ఇంట్రెస్టింగ్‌గా ఉందట. సుకుమార్‌ స్క్రీన్‌ ప్లే చాలా గ్రిప్పింగ్‌గా ఉందని, సీట్‌ ఎడ్జ్ థ్రిల్లర్‌ అంశాలు ఆకట్టుకుంటున్నాయట. `కాంతార` ఫేమ్‌ అజనీష్‌ లోక్‌నాథ్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి పెద్ద అసెట్‌ అంటున్నారు. ప్రీ ఇంటర్వెల్‌లో చిల్‌ అయ్యే మూమెంట్స్ ఉన్నాయట. సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ కలిగేలా ఇంటర్వెల్‌ సెట్‌ చేశారట. మొదటిభాగంలో లవ్‌ స్టోరీ బోరింగ్‌గా ఉంటుందట. అలాగే సినిమా కూడా స్లోగా సాగుతుందని చెబుతున్నారు.
 

సెకండాఫ్‌లో థ్రిల్లర్‌ ఎలిమెంట్లు ఉన్నాయట. సస్పెన్స్ సినిమా ఆసాంతం కంటిన్యూ అవుతుందని, అదే ఆడియెన్స్ ని ఎంగేజ్‌ చేస్తుందని ఆడియెన్స్ పోస్టులు పెడుతున్నారు. ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్, బీజీఎం బాగుందట. అయితే క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేదని, ఇంకా బెటర్‌ చేయాల్సి ఉందంటున్నారు. ఓ డీసెంట్‌ మూవీ అని, ఎక్స్ లెంట్‌ అనే స్థాయిలో, బ్లాక్‌ బస్టర్‌ రేంజ్‌లో లేదంటున్నారు.
 

సినిమాలో సూర్యగా సాయిధరమ్‌ తేజ్‌ చాలా కొత్తగా, ఫ్రెష్‌గా కనిపిస్తున్నాడు. ఆయన లుక్, యాక్టింగ్‌ స్టయిల్‌ కూడా కొత్తగా ఉందని అంటున్నారు. పాత్రలో ఇన్‌వాల్వ్ అయి చేశాడట. సెటిల్డ్ గా నటించాడని చెబుతున్నారు. ఆయనకిది మంచి కమ్‌ బ్యాక్‌ మూవీ అవుతుందంటున్నారు. ఇంకా చెప్పాలంటే బౌన్స్ బ్యాక్‌ అయ్యే చిత్రమవుతుందని తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. నందినిగా కనిపించిన సంయుక్త మీనన్‌కి మంచి పాత్ర దక్కిందని, ఆమె కూడా సినిమాకి ఓ పిల్లర్‌లా నిలుస్తుందట. పాత్రకి యాప్ట్ మాత్రమేకాదు, అద్భుతంగా చేసిందట. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో ఇరగదీసిందట. మిగిలిన అందరు నటులు బాగా చేశారట.  విజువల్స్, వీఎఫ్‌ఎక్స్ గానీ, టెక్నికల్‌గానూ సినిమా బాగుందంటున్నారు.
 

ఓవరాల్‌గా స్లో అనేది, లవ్‌ స్టోరీ బోరింగ్‌, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేదనే అంశాలు తప్ప మిగిలినవి పాజిటివ్‌గా ఉన్నాయి. సినిమా ఫర్వాలేదు, బాగానే ఉందనే టాక్‌ ఎక్కువగా ఉంది. సాయిధరమ్‌ తేజ్‌కి మంచి హిట్‌ పడుతుందని, ఆయనకు ఇదొక బౌన్స్ బ్యాక్‌ లాంటి సినిమా అవుతుందని, కెరీర్‌లో చెప్పుకునే చిత్రమవుతుందని సినిమా చూసిన ఓవర్సీస్‌ ఆడియెన్స్ చెబుతున్నారు. మరి మన తెలుగు ఆడియెన్స్ కి ఈ సినిమా ఎలా కనెక్ట్ అవుతుంది, ఏమేరకు ఆకట్టుకుంటుందనేది చూడాలి. పూర్తి స్థాయి `ఏషియానెట్‌` రివ్యూ కోసం వేచి ఉండండి.
 

Latest Videos

click me!