బిగ్ బాస్ ఫేమ్, యూట్యూబర్, నటుడు షణ్ముఖ్ జస్వంత్ తాజాగా మొదటిసారి తన లవ్ బ్రేకప్ పై స్పందించాడు. ఆ సమయంలో బాగా ఏడ్చేశానని, ప్రేమలో హోప్ప్ పోయాయని తెలిపాడు.
షణ్ముఖ్ జస్వంత్.. బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన నటుడు. అంతకు ముందు యూట్యూబర్‌గా చాలా పాపులర్. తన వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. డాన్స్ వీడియోలతో విశేషంగా ఆకట్టుకున్నాడు. దీంతో ఆయనకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ క్రమంలో తనకు బిగ్ బాస్ తెలుగు 5 షోలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ షో ఆయన్ని చాలా రకాలుగా మార్చేసింది.
25
బిగ్ బాస్ షో తర్వాత దీప్తి సునైనాతో బ్రేకప్
బిగ్ బాస్ తెలుగు 5లో పాల్గొన్న తర్వాత ఆయన వ్యక్తత్వానికి సంబంధించిన కామెంట్లు వచ్చాయి. విన్నర్ కావాల్సిన వాడు రన్నరప్‌గా మిగిలాడు. అనంతరం ఆయన ప్రియురాలు బ్రేకప్ చెప్పింది. షణ్ముఖ్, దీప్తి సునైనా ప్రేమలో ఉన్నారు. చాలా ఏళ్లు ప్రేమించుకున్నారు. బిగ్ బాస్ షో తర్వాత ఆయనకు గుడ్ బై చెప్పింది దీప్తి. ఆ సమయంలో ఇద్దరూ సోషల్ మీడియాలో పోస్ట్ లతో తమ బాధని వ్యక్తం చేసుకున్నారు. ముఖ్యంగా దీప్తి తన ఆవేదన వ్యక్తం చేసింది. కానీ షణ్ముఖ్ పెద్దగా ఓపెన్ కాలేదు.
35
బ్రేకప్‌పై తొలిసారి స్పందించిన షణ్ముఖ్
ఈ క్రమంలో తాజాగా షణ్ముఖ్ జస్వంత్ ఓపెన్ అయ్యారు. ఆయన యూట్యూబ్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. తెలుగు కనెక్ట్స్ కి ఇచ్చిన బ్రాడ్ కాస్ట్ లో షణ్ముఖ్ జస్వంత్ మొదటిసారి తన బ్రేకప్‌పై స్పందించారు. తన జీవితంలో హై, లో చాలా చూశానని తెలిపారు. తాను బేసిక్‌గా ఎమోషనల్ అని, బ్రేకప్ సమయంలో ఘోరంగా ఏడ్చేశానని తెలిపారు. ఏం చేయాలో అర్థం కాలేదని, పెడితే పోస్ట్ లు, లేదంటే కన్నీళ్లు ఇలానే సాగిపోయిందని చెప్పారు షణ్ముఖ్. తాను బాధపడ్డాను, తన లాగే అవతలి వ్యక్తి కూడా బాధపడుతుందని గ్రహించాను, ఆ తర్వాత కంట్రోల్ చేసుకున్నట్టు చెప్పారు.
ఆ సమయంలో తాను ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని, ఒత్తిడి తీసుకురాలేదని, వారి ఆలోచనలకు, నిర్ణయాలకు రెస్పెక్ట్ ఇచ్చి సైలెంట్‌గా ఉన్నట్టు తెలిపారు షణ్ముఖ్ జస్వంత్. అయితే ఓ దశలో ప్రేమపై తన ఆశలు పోయాయని, ఇక ప్రేమ అనే జోలికి వెళ్లకూడదని అనుకున్నట్టు తెలిపారు. అలాంటి సమయంలో మరో ప్రేమ తన లైఫ్‌లోకి వచ్చిందని, ఆ తర్వాత తన లైఫ్ చాలా మారిపోయిందని తెలిపాడు. షణ్ముఖ్ ఇటీవల వైష్ణవీ చోటిశెట్టితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. ఆయా ఫోటోలను పంచుకుంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు.
55
వైష్ణవీ వచ్చాక నా జీవితమే మారిపోయింది- షణ్ముఖ్‌జస్వంత్
వైష్ణవీ తన జీవితంలోకి వచ్చాక తన ఆలోచన విధానం చాలా మారిపోయిందన్నారు. చాలా ఓపెన్ అయినట్టు తెలిపారు. ఏదైనా ఫ్రీగా పంచుకోగలుగుతున్నట్టు వెల్లడించారు. అదే సమయంలో మొదటి ప్రేమకి గుర్తుగా డీ అనే గుర్తుని టాటూ వేయించుకున్నారు షణ్ముఖ్. అయితే దాన్ని తాను తొలగించలేదు. దీనిపై ఆయన స్పందిస్తూ, `పెళ్లి తర్వాతగానీ, లేదంటే ముందుగానే తీసేయాలనుకున్నా. కానీ ఈ విషయాన్ని వైష్ణవీకి చెప్పినప్పుడు ఆమె రియాక్షన్ వాహ్ అనిపించింది. అది నీకు మెమొరీ, ఉంచుకోవాలా? తీసుకోవాలా పూర్తిగా నీ ఇష్టం. దానికి నేను అభ్యంతరం తెలపను` అని తెలిపింది. దీంతో నేను షాక్ అయ్యాను. ఇలా కూడా అర్థం చేసుకుంటారా? అనిపించింది. జీవితానికి సంబంధించి నన్ను చాలా మార్చేసింది. సింపుల్ లైఫ్, ఇతరులకు హెల్ప్ చేయడం వంటి విషయాల్లో నాలో చాలా మార్పు తెచ్చింది` అని తెలిపారు షణ్ముఖ్. అదే సమయంలో జీవితంలో చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నట్టువెల్లడించాడు.