తమిళ సినీ పరిశ్రమలో చాలా మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు శివకుమార్. చిన్న వయసు నుండే మంచి నటుడిగా, మనిషిగా కళా ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న శివకుమార్ తన ఇద్దరు కుమారులను కూడా అదేవిధంగా పెంచారు. నేటి తమిళ సినిమాలో చిన్న చెడు అలవాటు కూడా లేకుండా ప్రయాణిస్తున్న కొద్దిమంది నటుల్లో శివకుమార్ ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.
తమ్ముడు కార్తి కంటే ముందుగా అన్నయ్య సూర్య సినీ రంగ ప్రవేశం చేశారు. తొలినాళ్లలో ఆయన నటన పెద్దగా ఆకట్టుకోలేదు. డైలాగ్ సరిగ్గా చెప్పలేకపోయిన నటుడు సూర్య ఆ తర్వాత తనను తాను మలుచుకుని ఎదగడం ప్రారంభించాడు. "నంద", "పెరళగన్", "గజినీ" వంటి అనేక చిత్రాలలో ఆయన నటనకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.
2004 సంవత్సరంలో దర్శకుడు శశి శంకర్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం "పెరళగన్ (సుందరాంగుడు )". సూర్య ద్విపాత్రాభినయం చేసిన చిత్రాల్లో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా "చిన్న" పాత్రలో, ఒక వికలాంగుడిగా ఆయన నటన అద్భుతం.