Game Changer
సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కాబోతోంది గేమ్ ఛేంజర్ మూవీ. మెగా పవర్ స్టార్.. గ్లోబల్ హీరో రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమాను భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మించారు. అయితే ఈసినమా హిట్ అవ్వడం రామ్ చరణ్ కు ఎంత ముఖ్యమో.. శంకర్ కు కూడా అంతే ముఖ్యం. ఆర్ఆర్ఆర్, ఆచార్య తరువాత వస్తున్న సినిమా అయినా.. సోలో హీరోగా మాత్రం 2010 తరువాత.. అంటే ఐదారేళ్ళ తరువాత చరణ్ చేసిన సినిమా ఇది. దాంతో ఫ్యాన్స్ లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.
Also Read: సమంత - శోభిత కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏంటో తెలుసా..?
Pushpa 2 and Game Changer
అటు పుష్ప2 ప్రభంజనంతో అందనంత ఎత్తున కలెక్షన్స్ ను టార్గెట్ ను పెట్టాడు అల్లు అర్జున్. ఇక అంత కాకపోయినా.. 1000 కోట్ల కలెక్షన్లు దాటించి అయినా పరువు నిలబెట్టుకోవాలని చూస్తున్నారు రామ్ చరణ్. ఈ సినిమా సక్సెస్ పై రామ్ చరణ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
అయితే ఫ్యాన్స్ కు మాత్రం శంకర్ భయం పట్టుకుంది. ఆయన సినిమాలు ఈమధ్య పెద్దగా పేలట్లేదు. మరి అలాంటిది శంకర్ డైరెక్షన్ లో సినిమా.. రికార్డ్ ల సంగతి అటు ఉంచితే... హిట్ అవుతుందా.. లేక ఇబ్బందిపెడుతుందా అని భయపడుతున్నారు మెగా ప్యాన్స్.
Director Shankar
ఇక శంకర్ కూడా ఈసినిమాపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. 2010 లో వచ్చిన రోబో సినిమా తరువాత శంకర్ ఆ రేంజ్ హిట్ ను చూడలేదు. ఈ మధ్యలో వచ్చిన ఐ, స్నేహితుడు, (3 ఇడియట్స్ రీమేక్) 2.0, ఇండియన్ 2 సినిమాలు ఆడియన్స్ ను నిరాశపరిచాయి. ఐ సినిమా మాత్రం కాస్త పర్వాలేదు అనిపించింది. ఇలా వరుసగా ప్లాప్ సినిమాలతో ఇబ్బందిపడిన శంకర్ గేమ్ ఛేంజర్ హిట్ అయితే మళ్ళీ ట్రాక్ లో పడే అవకాశం ఉంది.
దాంతో శంకర్ కు కూడా ఇది ఎంతో ముఖ్యమైన సినిమా. దాదాపు మూడేళ్ళ పాటు షూటింగ్ జరుపుకున్న ఈమూవీ అనుకున్నట్టుగా బ్లాక్ బస్టర్ హిట్ అయితే.. శంకర్ కు మరో లైఫ్ ఇచ్చిన హీరోగా రామ్ చరణ్ నిలిచిపోతాడు. ఇక ఈవిషయాలు పక్కన పెడితే.. గేమ్ ఛేంజర్ కోసం డైరెక్టర్ శంకర్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
ఇంతకీ ఆయన ఈసినిమాకు ఎంత వసూలు చేశాడో తెలుసా..? శంకర్ ఈసినిమాకోసం 50 కోట్లు తీసుకున్నాడు అని ప్రచారం జరుగుతుంది. అయితే ఇందులో నిజంలేదు అంటున్నారు మరికొంత మంది. ఈమూవీ నుంచి ఆయన రెమ్యునరేషన్ తీసుకోలేదు.. ఒక వేళ సినిమా హిట్ అయితే.. అందులో లాభాలు కొంత తీసుకుంటాను అన్నారట.
అలా అయితే.. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి 1000 కోట్ల మార్క్ దాటితే శంకర్ కు 100 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ అందే అవకాశం ఉంది అంటున్నారు. ఒక వేళ ప్లాప్ అయితే ఎంత తీసుకుంటారో చూడాలి. అయితే ఇప్పుడు చెప్పుతున్న లెక్కలు కూడా కొన్ని వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం చెప్పినవే. నిజానిజాలు మాత్రం వారికే తెలియాలి.