ప్రముఖ దర్శకుడు శంకర్ దగ్గర ఎంత్రన్, నన్బన్ వంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు అట్లీ. ఆ తర్వాత రాజా రాణి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. విజయ్ తో తెరి, మెర్సల్, బిగిల్ వంటి హ్యాట్రిక్ హిట్ సినిమాలు తీసి అట్లీ దూసుకుపోయారు. గతేడాది బాలీవుడ్ లో అడుగుపెట్టి షారుఖ్ తో జవాన్ సినిమా తీశారు.
జవాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బాక్సాఫీస్ దగ్గర రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. జవాన్ సినిమా విజయంతో గురువును మించిన శిష్యుడిగా పేరు తెచ్చుకున్నారు అట్లీ. ప్రస్తుతం ఆయనతో సినిమా చేయడానికి బాలీవుడ్ మొత్తం వేచి చూస్తోంది. తదుపరి సల్మాన్ ఖాన్, కమల్ హాసన్ లతో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.