తీశావులే బోడి బాహుబలి, అంటూ రాజమౌళిని అవమానించిన కీరవాణి భార్య.. అసలు ఏం జరిగింది?

రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి తెలుగు సినిమా ముఖ చిత్రాన్ని మార్చేసింది. అయితే కీరవాణి భార్య శ్రీవల్లి తీసావులే బోడి బాహుబలి సినిమా అని ఎద్దేవా చేసిందట. 
 

వరుస విజయాలతో జోరు మీదున్న రాజమౌళి ఓ భారీ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్లాన్ చేశాడు. రెండు భాగాలుగా చిత్రీకరించనున్న బాహుబలి సిరీస్ కి హీరోగా ప్రభాస్ ని ఎంచుకున్నారు. ఇక రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్ లను కీలక పాత్రల్లో మెరిశారు. 2013లో బాహుబలి: ది బిగినింగ్ షూటింగ్ మొదలైంది. 2015లో బాహుబలి చిత్రాన్ని ఐదు భాషల్లో ఇండియా వైడ్ విడుదల చేశారు. 
 

గ్రాండ్ స్కేల్ లో విజువల్ వండర్ గా బాహుబలి చిత్రాన్ని రాజమౌళి తీర్చిదిద్దారు. ఫస్ట్ షో నుండే బ్లాక్ బస్టర్ టాక్. ప్రభాస్, రానాల లుక్స్ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ అబ్బురపరిచాయి. రాజమౌళి ఇమేజ్ ని బాహుబలి తారా స్థాయికి తీసుకెళ్లింది. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. బాహుబలి 1 వరల్డ్ వైడ్ రూ. 650 కోట్ల గ్రాస్ రాబట్టింది. 
 


బాహుబలి దర్శకుడిగా రాజమౌళి పేరు ఇండియా వైడ్ మారుమ్రోగుతుంటే... రాజమౌళి అన్నయ్య కీరవాణి భార్య వల్లి, తేలికగా ఆ సినిమాను తీసిపారేసిందట. ఈ విషయాన్ని హీరో నాని ఓ సందర్భంలో వెల్లడించారు. బాహుబలి విడుదలయ్యాక నాని రాజమౌళికి ఇంటికి వెళ్లారట. రాజమౌళితో పాటు కుటుంబ సభ్యులు అందరూ డైనింగ్ టేబుల్ వద్ద ఉన్నారట. 
 


నానిని చూసి వచ్చి కూర్చో అన్నారట. నాని వారితో పాటు కూర్చున్నాడట. మళ్ళీ బాహుబలి సినిమా చూసేందుకు వెళదాం.. టికెట్స్ బుక్ చేయండి అన్నాడట. తీశావులే ఓ బోడి సినిమా మళ్ళీ వెళ్ళాలట అని... వల్లి అన్నారట. దేశమంతా మెచ్చుకుంటున్న సినిమాను కూడా వల్లి అలా అనేశారట. నాని తన సినిమాలు రిలీజ్ అయ్యాక వల్లి  కి ఫోన్ చేసి అడిగితే... ఛీ ఛీ అదేం సినిమా అనేస్తుందట. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి రెండో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?

వల్లి గొప్ప రివ్యూవర్. ఆమెకు ఒక పట్టాన సినిమా నచ్చదు, అని నాని అన్నారు. ఇక్కడ రాజమౌళిని ఆమె అవమానించలేదు. ఉన్న విషయాన్ని ముక్కు సూటిగా చెప్పేస్తుంది. ఆమె గొప్ప విమర్శకురాలు అనే కోణంలో నాని చెప్పారు. కాగా వల్లి సైతం బాహుబలి చిత్రాలకు పని చేశారు. ఆమె లైన్ ప్రొడ్యూసర్. నానికి చాలా కాలంగా రాజమౌళి ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నాని హీరోగా రాజమౌళి ఈగ సినిమా తీసిన సంగతి తెలిసిందే.

Bahubali 2

ఇక బాహుబలి చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన బాహుబలి: ది కంక్లూజన్ ఇండియన్ బాక్సాఫీస్ రికార్డ్స్ తుడిచిపెట్టింది వరల్డ్ వైడ్ బాహుబలి రూ. 1800 కోట్ల వరకు వసూలు చేసిందని అంచనా. బాహుబలి విడుదలైన రెండేళ్లకు 2017లో బాహుబలి 2 విడుదల చేశారు. 

ఆర్ ఆర్ ఆర్ తో రాజమౌళి గ్లోబల్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరాడు. మహేష్ బాబుతో చేస్తున్న SSMB 29 చిత్రాన్ని భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇది ఫ్యాన్ వరల్డ్ మూవీ అని సమాచారం. యూనివర్సల్ సబ్జెక్టు ఎంచుకుని హాలీవుడ్ రేంజ్ మూవీ ఇండియన్ ఆడియన్స్ కి పరిచయం చేయాలని చూస్తున్నారు. త్వరలో ఈ చిత్రం పట్టాలెక్కనుంది. 

Latest Videos

click me!