శంకర్‌ కూతురు ఐశ్వర్య రెండో పెళ్లి.. గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్‌.. అబ్బాయి ఎవరంటే?

Published : Feb 19, 2024, 07:22 AM IST

స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ కూతురు ఐశ్వర్య శంకర్‌ ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. ఆదివారం సాయంత్రం గ్రాండ్‌గా ఆమె నిశ్చితార్థం చేశారు. తాజాగా వారి ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

PREV
17
శంకర్‌ కూతురు ఐశ్వర్య రెండో పెళ్లి.. గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్‌.. అబ్బాయి ఎవరంటే?

ప్రముఖ దర్శకుడు శంకర్‌ పెద్ద కూతురు ఐశ్వర్య శంకర్‌ రెండో పెళ్లికి రెడీ అయ్యింది. తాజాగా ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది. శంకర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ తరుణ్‌ కార్తికేయన్‌తో ఆదివారం ఆమె ఎంగేజ్‌మెంట్‌ జరగడం విశేషం. తాజాగా ఈ ఫోటోలను ఐశ్వర్య చెల్లి, శంకర్‌ రెండో కూతురు అదితి శంకర్‌ సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. 
 

27

ఇందులో ఆమె పేర్కొంటూ `వాళ్లిద్దరు ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు` అని పేర్కొంది. తన సంతోషాన్ని పంచుకుంది. దీంతోపాటు ఐశ్వర్య శంకర్‌, తరుణ్‌లకు ఎంగేజ్‌మెంట్‌ పిక్స్ సైతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 
 

37

తరుణ్‌ కార్తికేయన్‌..శంకర్‌ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చాలా కాలంగా పనిచేస్తున్నారు. ఐశ్వర్యకి, ఆయను పరిచయం ఉంది. ఇలా శంకర్‌ దగ్గరుండి ఈ మ్యారేజ్‌ని సెట్‌ చేశారట. త్వరలోనే పెళ్లి కూడా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక వీరికి సెలబ్రిటీలు, అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు. 
 

47

ఇదిలా ఉంటే ఐశ్వర్య శంకర్‌.. మూడేళ్ల క్రితమే క్రికెటర్‌ రోహిత్‌తో పెళ్లి జరిగింది. చాలా గ్రాండ్‌గా వీరి వెడ్డింగ్‌ వేడుక నిర్వహించారు. అంతేకాదు చాలా గ్రాండ్‌గా రిసెప్షన్‌ కూడా ప్లాన్‌ చేశారు. దీనికి సెలబ్రిటీలను ఆహ్వానించారు. అంతలోనే పెళ్లిని క్యాన్సిల్‌ చేశారు. కానీ రోహిత్‌పై పలు ఆరోపణలు అని తెలుస్తుంది.
 

57

 రోహిత్‌ ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు. ఆయనపై 16ఏళ్ల బాలిక లైంగిక ఆరోపణలతో కేసు పెట్టింది. అంతేకాదు ఈ కేసులో రోహిత్‌ పేరు కూడా తెరపైకి వచ్చింది. దీంతో సడెన్‌గా శంకర.. ఐశ్వర్య, రోహిత్‌ల రిసెప్షన్‌ క్యాన్సిల్ చేశారు. పెళ్లిని కూడా రద్దు చేశారు. 
 

67

పోస్కో కేసులో రోహిత్‌ ఫ్యామిలీ పేరు వినిపించడమే దానికి కారణమని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూతురుకి రెండో పెళ్లి చేసేందుకు సిద్ధమవడం విశేషం. ఐశ్వర్య డాక్టర్‌గా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. 
 

77

శంకర్‌ ప్రస్తుతం `గేమ్‌ ఛేంజర్‌`, `ఇండియన్‌ 2`, `ఇండియన్‌ 3` చిత్రాలను రూపొందిస్తున్నారు. `గేమ్‌ ఛేంజర్‌`లో రామ్‌ చరణ్‌ హీరోగా నటిస్తున్నారు. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా ఇది రాబోతుంది. ఈ ఏడాది చివర్లో ఈ మూవీ రాబోతుంది.మరోవైపు కమల్‌ హాసన్‌తో `ఇండియన్‌ 2, 3`లను తెరకెక్కిస్తున్నారు. రెండో పార్ట్ ఈ ఏడాదిలోనే రాబోతుందని తెలుస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories