సినిమా మొదలుపెట్టకుండానే లక్షలు ఖర్చు చేశాడు... కిరాక్ ఆర్పీ బండారం బయటపెట్టిన షేకింగ్ శేషు!

Published : Jul 13, 2022, 12:31 PM IST

మల్లెమాల సంస్థపై దాని అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డిపై కిరాక్ ఆర్పీ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వాళ్ళు పెట్టే ఫుడ్ చంచల్ గూడా, చర్లపల్లి జైళ్లలో కంటే దారుణంగా ఉంటుందని దారుణమైన కామెంట్స్ చేశారు. మల్లెమాల సంస్థ క్రెడిబిలిటీ దెబ్బతీసేలా పలు విమర్శలు చేయడం జరిగింది.

PREV
17
సినిమా మొదలుపెట్టకుండానే లక్షలు ఖర్చు చేశాడు... కిరాక్ ఆర్పీ బండారం బయటపెట్టిన షేకింగ్ శేషు!
Kirak RP

కిరాక్ ఆర్పీ(Kirak RP) ఆరోపణల నేపథ్యంలో షేకింగ్ శేషు స్పందించారు. జబర్దస్త్ మేకర్స్ పై విమర్శలు గుప్పించిన కిరాక్ ఆర్పీపై ఆయన మండిపడ్డారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని విమర్శించే అంతటి గొప్పవాడిగా అంటూ విరుచుకుపడ్డారు. నీకు జబర్దస్త్ వాళ్లు పెట్టే ఫుడ్ నచ్చకపోతే స్టార్ హోటల్ నుండి తెప్పించుకు తిను, వారేమి వద్దు అనరు కదా... అన్నం పెట్టిన సంస్థను విమర్శిచడం అంటే కన్న తల్లిని విమర్శించినట్లే అన్నాడు.

27
Kirak RP

శ్యామ్ ప్రసాద్ రెడ్డి వయసెంత, అనుభవమెంత. అలాంటి వ్యక్తిని విమర్శిస్తావా?. ముందు నువ్వు సరినవాడివి కావు... దర్శకుడిని అవుతా అంటూ సినిమా స్టార్ట్ చేశారు. మూవీ సెట్స్ పైకి వెళ్లకుండానే రూ. 20 లక్షలు ఖర్చు చేశావు. సినిమానే మొదలు కాలేదు, అప్పుడే ఇంత ఖర్చు ఏంటని ఆ నిర్మాత నిలదీశాడు. తన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఆర్పిపై ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. 
 

37
Kirak RP

నువ్వు చేసిన తప్పుకు కూడా జబర్దస్త్(Jabardasth) పేరే చెడిపోయింది. జబర్దస్త్ నటుడు కిరాక్ ఆర్పీ ఇలా చేశాడని వార్తలు వచ్చాయి. జబర్దస్త్ ద్వారా ఓ స్థాయికి వచ్చి ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదని షేకింగ్ శేషు ఆర్పీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇంకా పలు విషయాలు ఆయన ప్రస్తావించడం జరిగింది. 
 

47

Kirak Rp


నాగబాబుతో పాటు జబర్దస్త్ నుండి వెళ్ళిపోయిన ఆర్పీ ఆ మధ్య దర్శకుడిగా ఓ మూవీ స్టార్ట్ చేశాడు. జేడీ చక్రవర్తి హీరోగా ఆ మూవీ ప్రారంభమైంది. తన గురువు నాగబాబు(Nagababu) చేతుల మీదుగా సినిమా ఓపెనింగ్ చేశాడు. ఇక ఆ మూవీ కనీసం సెట్స్ పైకి వెళ్లకుండానే నిర్మాత డబ్బులు వృధా ఖర్చు చేశాడని మూవీ ఆగిపోయినట్లు సమాచారం. 

57


ఇక కిరాక్ ఆర్పీ ఆరోపణలు వెనుక నాగబాబు ఉన్నారన్న మాట గట్టిగా వినిపిస్తుంది. నాగబాబు ఉద్దేశపూర్వకంగా ఆర్పీతో అలా ఆరోపణలు చేయించారని, నాగబాబు అండ లేకుండా అలాంటి ఆరోపణలు చేసే ధైర్యం ఆర్పీకి లేదని కొందరు అంటున్నారు. జబర్దస్త్ షోని దెబ్బతీసే ప్రణాళికలో భాగంగా ఆర్పీ ఆరోపణలు చేసి ఉండవచ్చన్న వాదన వినిపిస్తుంది. 

67


అలాగే షేకింగ్ శేషుతో పాటు హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ కూడా కిరాక్ ఆర్పీ ఆరోపణలు ఖండించారు. అతడు చెప్పిన దాంట్లో వాస్తవం లేదన్నారు. సినిమా అవకాశాలు రావడం వలనే సుధీర్, గెటప్ శ్రీను జబర్దస్త్ నుండి వెళ్లిపోయారని వివరించారు. 

77


ఇటీవల ఓ అమ్మాయితో కిరాక్ ఆర్పీకి నిశ్చితార్థం జరిగింది. ఇక కమెడియన్ గా స్టార్ మాలో ప్రసారం అవుతున్న స్టార్ కమెడియన్స్ షోలో కిరాక్ ఆర్పీ చేస్తున్నారు. ఈ షోకి నాగబాబు జడ్జిగా ఉన్నారు. ప్రస్తుతం ఈ షోలో దాదాపు జబర్దస్త్ మాజీ కమెడియన్స్ నటిస్తున్నారు. 

click me!

Recommended Stories