షారుఖ్ ఖాన్ -విజయ్ దళపతి భారీ మల్టీ స్టారర్...? ఇంతకీ డైరెక్టర్ ఎవరంటే..?

First Published | Feb 13, 2023, 1:30 PM IST

ఓ స్టార్ డైరెక్టర్ తో ఇద్దరు  స్టార్ హీరోలు కలిసి సినిమా చేస్తున్నారు అంటే.. అంచనాలు మూమూలుగా ఉండవు మరి. ఒక్క స్టార్ హీరో ఒక స్టార్ డైరెక్టర్ అంటేనే అది ధమాకా ఆఫర్ అంటే.. ఇద్దరు స్టార్ హీరోలు..ఒక స్టార్ డైరెక్టర్ అంటే..అది డబుల్ ధమాకానే ఆడియన్స్ కు. . బాక్సాఫీస్ రికార్డులు షేక్ అవ్వడం ఖాయమే. ప్రస్తుతం అలాంటి బాక్సాఫీస్ బద్దలయ్యే వార్తే ఒకటి దేశవ్యాప్తంగా చక్కర్లు కొడుతోంది. 

సౌత్ నార్త్ కలయికతో ఓ భారీ మల్టీ స్టారర్ కుప్లానింగ్ జరుగుతుంది. బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ కాన్.. సౌత్ స్టార్ హీరో విజయ్ దళపతి కాంబినేషన్ ల మూవీ అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇంతకీ ఈ వార్తల్లో నిజమెంత. 

ఫిల్మ్ ఇండస్ట్రీలే క్రేజీ కాంబినేషన్లకు కొదవలేదు. ఇప్పటికే ఎవరూ ఊహించని కాంబోలలో సినిమాలు రిలీజ్ అయ్యాయి.. ఇప్పటికీ తెరకెక్కుతూనే ఉన్నాయి. టాలీవుడ్ వల్ల ఒక్కటిగా మారిన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ.. లో కొత్త కొత్త కలయికలు జరుగుతున్నాయి. ఈక్రమంలోనే సౌత్ నార్త్ కలయికలో ఓ భారీ సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోందిత. 
 


ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు సోలోగా ఓ స్టార్ హీరో సినిమా చేస్తున్నాడు అంటే పెద్దగా ఇంట్రస్ట్ చూపించని జనం...ఇద్దరు స్టార్ హీరోలు కలిసి సినిమా చేస్తున్నారు అంటే చాలు.. క్రేజీగా ఫీల్అవుతున్నారు. భారీ హిట్ చేస్తున్నారు. ప్రస్తుతం కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు మరి. ఆ ఫార్ములాను ఫాలో అయ్యే.. ఓ క్రేజీ మల్టీ స్టారర్ రూపొందబోతున్నట్టు తెలుస్తోంది. 

ఈసినిమాలో సౌత్ నుంచి విజయ్దళపతి.. నార్త్ నుంచి షారుఖ్ నటిస్తారట.  మరి డైరెక్టర్ ఎవరు..? ఇంత పెద్ద స్టార్లను డైరెక్ట్ చేయాలి అంటే అతను కూడా పెద్ద స్టార్ అయ్యి ఉండాలికదా..? సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న శంకర్ ఈ  సినిమాను డైరెక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. 
 

ఈసినిమాలో సౌత్ నుంచి విజయ్దళపతి.. నార్త్ నుంచి షారుఖ్ నటిస్తారట.  మరి డైరెక్టర్ ఎవరు..? ఇంత పెద్ద స్టార్లను డైరెక్ట్ చేయాలి అంటే అతను కూడా పెద్ద స్టార్ అయ్యి ఉండాలికదా..? సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న శంకర్ ఈ  సినిమాను డైరెక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. 

 శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా.. అది కూడా  బాలీవుడ్ బాద్ షా షారుఖ్ తో పాటు దళపతి విజయ్ లు కలిసి నటిస్తున్నారు ఇప్పుడు ఇండస్ట్రీలో భారీ చర్చకు దారి తీస్తున్న ప్రాజెక్ట్ ఇది. అది నిజమో కాదో తెలియదు కాని.. నెట్టింట్లో మాత్రం గట్టిగా చక్కర్లు కొడుతోంది. అఫీషియల్ అనౌస్స్ మెంట్ వస్తే కాని అసలు నిజం తెలియదు. 

Latest Videos

click me!