భూమిక చావ్లాలో ఈ టాలెంట్ కూడానా.. త్రోబ్యాక్ పిక్ తో మైండ్ బ్లాక్ చేసిన సీనియర్ నటి

First Published | Feb 13, 2023, 12:35 PM IST

సీనియర్ నటి భూమిక చావ్లా (Bhumika Chawla) తాజాగా ఓ త్రో బ్యాక్ పిక్ ను పంచుకున్నారు. స్టన్నింగ్ స్టిల్ తో కట్టిపడేస్తున్నారు. ఈ పిక్స్ షేర్ చేస్తూ తనలోని మరోకోణాన్ని కూడా పరిచయం చేశారు. 
 

టాలీవుడ్ సీనియర్ నటి భూమిక చావ్లా గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. స్టార్ హీరోల సరసన నటించిన ఈ సుందరి ఇండస్ట్రీలో తనకుంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. 
 

చిరంజీవి, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి బడా హీరోలతో జతకట్టి వెండితెరపై తన సత్తా చాటారు. సింహాద్రి, ఒక్కడు, ఖుషీ, జై చిరంజీవ లాంటి గుర్తుండిపోయే ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.  


కేరీర్ ఫుల్ జోష్ లో ఉండగానే 2007లో యోగా టీచర్ భరత్ ఠాకూర్ అనే వ్యక్తితో  భూమిక పెళ్లి గ్రాండ్ గా జరిగింది. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నారు. పెళ్లి తర్వాత కూడా భూమిక సినిమాలకు దూరం కాలేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూనే ఉన్నారు. 
 

మరోవైపు సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు టచ్ లోనే ఉంటున్నారు. తరుచూ పోస్టులతో ఆకట్టుకుంటున్నారు. అయితే తాజాగా భూమిక ఓ త్రోబ్యాక్ పిక్ ను పంచుకున్నారు. బ్లాక్ లాంగ్ షర్ట్ లాంటి అవుట్ ఫిట్ లో స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకున్నారు. ఈ పిక్ షేర్ చేసుకుంటూ తనలోని మరోకోణాన్ని పరిచయం చేశారు.
 

నటన, గ్లామర్ పరంగానే కాకుండా.. తనకు  సాహిత్యం అంటే కూడా ఇష్టమని తాజాగా  తెలియజేశారు. ఈసందర్భంగా భూమిక 2014లో రాసిన ఓ కవ్విత్వాన్ని తాజాగా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ‘మనిషికి తన కోరికలు తెలియవు.. తనకు తాను దూరంగా, అపరిచితులకు దగ్గరగా  ఉండేవారే. సంపద కోసం పరిగెడుతూ..  తన స్వంత కోరికలను నిజం చేసేందుకు నిద్రలేని  రాత్రులను గడుపుతుంటారు’ అనే భావంలో రాసిన కవ్విత్వం ఆకట్టుకుంటోంది. 
 

ఇక ప్రస్తుతం భూమిక  సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నారు. లేడీ ఓరియెంట్ సినిమాలతో పాటు ఆయా చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. గతేడాది ‘సీతా రామం’, ‘బట్టర్ ఫ్లై’ చిత్రాలతో అలరించారు. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తున్నారు. అవి షూటింగ్ దశలో ఉన్నాయి. 
 

Latest Videos

click me!